ప్రాణాల మీదకు తెస్తున్న చైనా మాంజా…!

ప్రాణాల మీదకు తెస్తున్న చైనా మాంజా.

సంగారెడ్డి జిల్లా డాకూరులో బాలుడికి క‌రెంట్ షాక్‌.

ఆడుకుంటుండగా హైటెన్ష‌న్ వైర్‌లో చిక్కుకుపోయిన గాలి ప‌టం..

బాలుడు గ‌ట్టిగా లాగ‌డంతో క‌రెంట్ షాక్..

తీవ్ర గాయాల‌పాలైన బాలుడు.. ఆసుపత్రికి త‌ర‌లింపు..

చైనా మాంజా ప్రాణాల మీదికి తెస్తోంది. నిషేధించినా విక్రయాలు కొనసాగుతుండంతో ప్రాణాలు తీసేంత పని చేస్తోంది. తాజాగా….

చైనా మాంజాతో విషాదాలు చోటుచేసుకుంటున్నాయి…

గతంలో పలువురి ప్రాణాలు తీసిన చైనా మాంజా..తాజాగా మరో ఇద్దర్ని ప్రమాదంలో పడేసింది..

సంక్రాంతి సమయంలో చైనా మాంజా కారణంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు.

తీవ్రంగా గాయపడి ఆస్పత్రుల పాలవుతున్నారు. అయినా..
మార్కెట్‌లో చైనా మాంజా విక్రయానికి అడ్డుకట్ట పడడంలేదు. పోలీసులు సోదాలు చేసి కేసులు నమోదు చేస్తున్నా.. రహస్యంగా విక్రయాలు కొనసాగిస్తున్నారు కొందరు వ్యాపారులు…
గతంలో చైనా మాంజాను ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌కు సీక్రెట్‌గా తీసుకొచ్చి విక్రయించగా, కొన్నాళ్ల నుంచి లోకల్‌లోనే తయారు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇదిలావుంటే.. ఈ చైనా మాంజాను నైలాన్‌, సింథటిక్‌ దారానికి గాజు, ప్లాస్టిక్‌ పొడి పూసి తయారు చేస్తుంటారు. ఇది సాధారణ దారం కంటే గట్టిగా పదునుగా ఉండడం.. గాలి పటాలు ఎగరేసిన తర్వాత అలానే వదిలేస్తుండడంతో రోడ్లపై వెళ్లే వారి మెడలకు చుట్టుకుని ప్రమాదాలు జరుగుతున్నాయి. దాంతో.. ఇప్పటికైనా చైనా మాంజా బ్యాన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు బాధితులు..

గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959