మాజీ మంత్రి జోగు రామన్న హౌస్ అరెస్ట్….!

మాజీ మంత్రి జోగు రామన్న హౌస్ అరెస్ట్….

తెలంగాణ : సీఎం రేవంత్‌ రెడ్డి పర్యటన నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పర్యటనను అడ్డుకుని తీరతామంటూ బీఆర్‌ఎస్‌ శ్రేణులు హెచ్చరించిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తం అయ్యారు. రెండు జిల్లాల ఎస్పీల నేతృత్వంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మాజీ మంత్రి జోగు రామన్నను అర్ధరాత్రి హౌజ్‌ అరెస్ట్ చేశారు. బీఆర్‌ఎస్‌ శ్రేణులు కూడా అటు వైపు రానివ్వకుండా ఆయన ఇంటి చుట్టూ భారీగా పోలీసులు మోహరించారు.

జోగు రామన్న మాట్లాడుతూ.. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చనాకా కొరాటా ప్రాజెక్టు ట్రయల్ రన్‌కు రావడం సిగ్గుమాలిన చర్య అని విమర్శించారు. ఆదిలాబాద్ జిల్లా రైతాంగానికి 50 వేల ఎకరాలకు నీరు అందించాలన్న సంకల్పంతో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ పూర్తిస్థాయిలో ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టి రైతులకు సంకల్పంతో కృషి చేశారని తెలిపారు. కానీ బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఒక్క ఎకరాకు కూడా అందించకుండా ట్రయల్ రన్ చేయడం, దాన్ని ప్రారంభించడం సిగ్గుమాలిన చర్య అని విమర్శించారు.

సీఎం పర్యటన నేపథ్యంలో శనివారం అర్ధరాత్రి నుంచే పోలీసులు ముందస్తు అరెస్టులు చేయడం అప్రజాస్వామికం అని జోగురామన్న మండిపడ్డారు. భేలా, జైనత్, ఆదిలాబాద్ మండల నాయకులను ఎక్కడికక్కడ అరెస్టులు చేయడం సమంజసం కాదని సూచించారు. ఒక్క ఎకరానికి కూడా నీరు అందించలేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనను రైతులు వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. రైతు సమస్యలు పరిష్కరించడంపై ధ్యాసలేని ఈ ముఖ్యమంత్రి కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ట్రయల్ రన్ అంటూ మోసం చేస్తున్నారని మండిపడ్డారు..

గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959