మున్సిపల్‌ ఎన్నికల రిజర్వేషన్ల జాబిత ప్రకటన…

మున్సిపల్‌ ఎన్నికల ( Municipal Elections ) నేపథ్యంలో రాష్ట్రంలోని మున్సిపల్‌ కార్పొరేషన్ల మేయర్లు ( Mayors ) , మున్సిపల్ చైర్‌పర్సన్ల( Chairpersons ) కు రిజర్వేషన్లు ( Reseervations ) ఖరారయ్యాయి. ఈ మేరకు మునిపల్ శాఖ డైరెక్టర్ శ్రీదేవి శనివారం ఖరాయిన రిజర్వేషన్ల జాబితాను విడుదల చేశారు. వీటిలో 50 శాతం కార్పొరేషన్లను మహిళలకు రిజర్వేషన్‌ చేసినట్లు వెల్లడించారు..

మొదట ఎస్టీ, ఎస్సీ రిజర్వేషన్లు ఖరారు చేశామని , లాటరీ ద్వారా 50శాతం మహిళలకు రిజర్వేషన్లు కల్పించామని వివరించారు. రాష్ట్రంలోని పది కార్పొరేషన్ల రిజర్వేషన్లు ఖరారు ఈ విధంగా ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ ఒకటి చొప్పున, బీసీ మహిళలకు మూడు మేయర్‌ పోస్టులకు రిజర్వేషన్‌ కల్పించామన్నారు. మరో 5 జనరల్‌కు కేటాయించామని చెప్పారు.

కొత్తగూడెం కార్పొరేషన్ ( ఎస్టీ జనరల్‌) రామగుండం కార్పొరేషన్ ( ఎస్సీ జనరల్ ) , మహబూబ్‌ నగర్‌ కార్పొరేషన్ (బీసీ మహిళ ), మంచిర్యాల, కరీంనగర్ కార్పొరేషన్ ( బీసీ జనరల్) వరంగల్ కార్పొరేషన్ ( జనరల్ ), ఖమ్మం, నిజామాబాద్, గ్రేటర్ హైదరాబాద్ ( మహిళా జనరల్ ) కు కేటాయించామని వివరించారు. వరంగల్‌ కార్పొరేషన్‌ను అన్‌ రిజర్వుడ్‌గా ఉంచారు. రాష్ట్రంలోని 121 మున్సిపాలిటీలల్లో చైర్మన్లుగా ఎస్టీలకు 5, ఎస్సీలకు 15, బీసీలకు 38, బీసీ మహిళలకు 19 రిజర్వేషన్లు ఖరాయయ్యని వివరించారు. మిగతా చోట్ల జనరల్‌కు కేటాయించామని వివరించారు.

కార్పొరేష‌న్ల‌కు రిజ‌ర్వేష‌న్లు .

1. జీహెచ్ఎంసీ – మహిళ ( జ‌న‌ర‌ల్‌ )
2. న‌ల్ల‌గొండ – మహిళ ( జ‌న‌ర‌ల్‌ )
3. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ – మ‌హిళ‌ (బీసీ)
4. జీడ‌బ్ల్యూఎంసీ – అన్ రిజ‌ర్వ్‌డ్‌
5. క‌రీంన‌గ‌ర్ – బీసీ ( జ‌న‌ర‌ల్‌ )
6. ఖ‌మ్మం – మహిళ ( జ‌న‌ర‌ల్‌ )
7. నిజామాబాద్ – మహిళ ( జ‌న‌ర‌ల్‌ )
8. మంచిర్యాల – బీసీ ( జ‌న‌ర‌ల్‌ )
9. కొత్త‌గూడెం – ఎస్టీ ( జ‌న‌ర‌ల్‌ )
10. రామ‌గుండం – ఎస్సీ ( జ‌న‌ర‌ల్‌ ).

సింబల్స్ విడుదల..
మున్సిపల్ ఎన్నికలను ఒకే విడతలో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగానే అధికారులు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఎన్నికలు జరగబోయే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఫైనల్ ఓటర్ లిస్టులను ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు.. మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థులకు కేటాయించనున్న సింబల్స్ (గుర్తుల)ను ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. 75 గుర్తులను కేటాయిస్తూ రాష్ట్ర ఎన్నిలక కమిషనర్ రాణి కుముదిని శుక్రవారం గెజిట్ జారీ చేశారు. . ఇక రాష్ట్ర ఎన్నికల సంఘంలో రిజిష్టర్ అయ్యి, పార్టీ సింబల్స్ లేని 77 పొలిటికల్ పార్టీలతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థుల కోసం 75 గుర్తులను కేటాయించారు.

గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959