*బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక*
రేపు ఉదయం 11గంటలకు నితిన్ నబీన్ ప్రమాణస్వీకారం.. హాజరు కానున్న ప్రధాని మోడీ…..
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ విజయవంతంగా పూర్తైంది. 36 రాష్ట్రాల్లో 30 రాష్ట్రాల అధ్యక్షుల ఎన్నిక పూర్తవడంతో, అవసరమైన కనీస 50 శాతం మద్దతు దక్కిన నేపథ్యంలో జాతీయ అధ్యక్ష ఎన్నికల ప్రక్రియను ప్రారంభించినట్లు పార్టీ ప్రకటించింది. ఈ నెల జనవరి 16న ఎన్నికల షెడ్యూల్ నోటిఫికేషన్తో పాటు ఎలక్టోరల్ రోల్ విడుదల చేశారు. షెడ్యూల్ ప్రకారం జనవరి 19 (సోమవారం) మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు నామినేషన్ ప్రక్రియ కొనసాగింది.
గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959