ఇందిరమ్మ ఇంటికి అనర్హులుగా క్యాబ్ డ్రైవర్లు.!?
దళితబంధు పథకం కింద జీవనోపాధి కోసం కారు కొనుక్కున్న వారికి, కారు ఉందనే కారణంతో ఇందిరమ్మ ఇళ్లు రద్దు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం
ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో క్యాబ్ డ్రైవర్ల పరిస్థితి అయోమయం..
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో దళితబంధు పథకం కింద, లేక అప్పు చేసి కారు కొనుక్కుని, క్యాబ్ డ్రైవర్లుగా పని చేస్తున్న వేలాది మంది నిరుపేదలు..
సొంత ఇల్లు కట్టుకునే స్తోమత లేక ఇందిరమ్మ ఇంటికి దరఖాస్తు చేసుకున్న క్యాబ్ డ్రైవర్లు..
లబ్ధిదారుడి పేరు మీద కారు ఉంటే, అతను నిరుపేద వర్గానికి చెందిన వారు కాదని, ఇందిరమ్మ ఇల్లు పొందే అర్హత లేదని నిబంధనలు పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం…
దీంతో ఇల్లు కోసం దరఖాస్తు చేసేటప్పుడు, వీరి దరఖాస్తులను ప్రత్యేక జాబితాలో చేర్చిన అధికారులు..
ఇన్ని రోజులు ఇంటి కోసం వేచి ఉన్న క్యాబ్ డ్రైవర్లకు తీవ్ర నిరాశ మిగిల్చిన ప్రభుత్వం, వారి పేరు మీద కారు ఉందని ఇందిరమ్మ ఇంటికి అనర్హుల జాబితాలో చేర్చుతున్న అధికారులు..
సొంత అవసరాల కోసం కారు కొనడం, ఉపాధి కోసం కారు కొనడం ఒకటి ఎలా అవుతుందని, ఈ విషయం ముందే చెబితే తాము ఆశలు పెట్టుకునే వాళ్లం కాదని ఆవేదన వ్యక్తం చేస్తున్న బాధితులు..