వెండితో వెడ్డింగ్ కార్డు.. ధర రూ. 25 లక్షలు
రాజస్థాన్ జైపూర్ లో ఓ తండ్రి తన కూతురి పెళ్లి కోసం ఏకంగా 3 కిలోల స్వచ్ఛమైన వెండితో వెడ్డింగ్ కార్డ్ చేయించారు. దీని ధర అక్షరాలా ₹25 లక్షలు. శివ్ జోహ్రీ అనే వ్యక్తి ఏడాది పాటు కష్టపడి, ఒక్క మేకు కూడా వాడకుండా 128 వెండి ముక్కలతో ఈ అద్భుతాన్ని సృష్టించారు. ఇందులో మొత్తం 65 మంది దేవుళ్ల ప్రతిమలను చెక్కించారు. తన కూతురి పెళ్లికి బంధువులతో పాటు సకల దేవతలను ఆహ్వానించాలనే ఉద్దేశంతోనే ఇలా చేశారట….
జైపూర్కు చెందిన శివ్ జ్యువెలర్ వ్యాపారి కుమార్తె శ్రుతి వివాహానికి దాదాపు రూ. 25 లక్షల విలువైన 3 కిలోల స్వచ్ఛమైన వెండిని ఉపయోగించి అద్భుతమైన ‘వివాహ ఆహ్వానం’ను రూపొందించాడు. ఈ కార్డు అత్యంత అద్భుతమైన లక్షణం దాని డిజైన్. 128 వేర్వేరు ముక్కలతో తయారు చేసిన ఈ కార్డులో ఒక్క మేకు, స్క్రూ కూడా ఉపయోగించలేదు. ఇది స్వచ్ఛమైన వెండితో పురాతన చేతిపనుల పరిపూర్ణ సమ్మేళనంతో చెక్కడం జరిగింది.
శివ్ జ్యువెలర్ తన కుమార్తె వివాహానికి బంధువులే కాకుండా విశ్వంలోని అన్ని దేవుళ్లు, దేవతలు కూడా సాక్ష్యమివ్వాలని కోరుకున్నాడు. అందువల్ల, ఈ 8 x 6.5-అంగుళాల కార్డులో 65 మంది దేవుళ్లు, దేవతల క్లిష్టమైన చిత్రాలతో చెక్కారు..
గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959.