200 కోట్ల మందికి చేరువగా భారత ఉత్పత్తులు…

200 కోట్ల మందికి చేరువగా భారత ఉత్పత్తులు.

ఈ ఒప్పందం ద్వారా దాదాపు 200 కోట్ల మంది జనాభా కలిగిన భారీ మార్కెట్ భారత్‌ కు అందుబాటులోకి రానుంది. ప్రపంచ జీడీపీలో 25% వాటా కలిగిన యూరోపియన్ యూనియన్‌ తో ఈ ఒప్పందం కుదుర్చుకోవడం వల్ల భారత ఎగుమతులకు సరికొత్త రెక్కలు రానున్నాయి. ముఖ్యంగా అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధం నడుస్తున్న తరుణంలో.. ఈ డీల్ భారత్‌ కు ఒక రక్షణ కవచంలా మారబోతోంది..

అమెరికా టారిఫ్ షాక్ నుండి విముక్తి! గత ఏడాది అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ భారత ఉత్పత్తులపై 50% వరకు పన్నులు (Tariffs) విధించిన సంగతి తెలిసిందే. దీనివల్ల భారత ఎగుమతిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అమెరికాపై ఆధారపడటం తగ్గించుకునే క్రమంలో భారత్ ఇప్పటికే యూకే, ఒమన్, న్యూజిలాండ్‌లతో ఒప్పందాలు చేసుకుంది. ఇప్పుడు ఈయూతో కుదిరిన ఈ ఒప్పందం (Trade Deal) భారత్‌ కు ఒక మరింత బలాన్ని ఇచ్చింది..