ఫోన్ ట్యాపింగ్ కేసులో రేపు కేసీఆర్ విచారణ…

ఫోన్ ట్యాపింగ్ కేసులో రేపు కేసీఆర్ విచారణ.. రేపు మధ్యాహ్నం 3 గంటలకు అందుబాటులో ఉండాలని నోటీసులు.. కేసీఆర్ వయస్సు రీత్యా స్టేషన్‌ హాజరుకు మినహాయింపు.. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు రావొచ్చు, లేదంటే హైదరాబాద్ పరిధిలో మరో ప్రదేశాన్ని సూచించవచ్చని కేసీఆర్‌కు నోటీసులు.. మీరు సూచించిన ప్రదేశానికి అధికారులు వస్తారని సిట్ నోటీసులు.. మీకు అనుకూలమైన ప్రదేశాన్ని ముందే చెప్పాలంటూ కేసీఆర్‌కు నోటీసులు….

రెండేళ్లుగా సాగుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసు తుది అంకానికి చేరుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సిట్‌ను పూర్తిగా ప్రక్షాళన చేసి.. సీపీ సజ్జనార్ నేతృత్వంలో మార్పులు చేర్పులు చేశారు. ఫోన్‌ ట్యాపింగ్‌‌కు పాల్పడిన పోలీస్ అధికారులను విచారించి, వారిని రిమాండ్‌కు తరలించారు. ఆ తరువాత ఫోన్ ట్యాపింగ్‌లో బాధ్యులుగా ఉన్నవారిని విచారించి వారి నుంచి వాంగ్మూలాన్ని నమోదు చేశారు. గత ప్రభుత్వ పెద్దలుగా ఉన్న కేటీఆర్, హరీశ్ రావు, సంతోష్ రావులను ఇప్పటికే సిట్ అధికారులు విచారించారు.

ఈ కేసులో భాగంగా.. మాజీ ముఖ్యమంత్రిని సిట్ అధికారులు విచారించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌కు నోటీసులు అందజేసి.. అక్కడే విచారణ చేపట్టే అవకాశముంది. అయితే కేసీఆర్ ఈ విచారణకు హాజరవుతారా? లేదా? అనేది ఉత్కంఠగా మారింది.