అమెరికా– కెనడా మధ్య వాణిజ్య సంబంధాలు మళ్లీ ఉద్రిక్తం..!

అమెరికా– కెనడా మధ్య వాణిజ్య సంబంధాలు మళ్లీ ఉద్రిక్తంగా మారాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి టారిఫ్‌ల ఆయుధాన్ని ఎత్తి చూపుతూ కెనడాపై కఠిన హెచ్చరికలు జారీ చేశారు. అమెరికాలోకి దిగుమతయ్యే కెనడాకు చెందిన అన్ని విమానాలపై 50 శాతం సుంకాలు విధిస్తానని స్పష్టం చేశారు. జార్జియాలోని సవన్నా కేంద్రంగా పనిచేస్తున్న అమెరికా విమాన తయారీ సంస్థ గల్ఫ్‌స్ట్రీమ్ ఏరోస్పేస్ జెట్లకు కెనడా సర్టిఫికేషన్ ఇవ్వడంలో నిరాకరించడమే దీనికి కారణమని ట్రంప్ ఆరోపించారు.

ట్రూత్ సోషల్‌లో చేసిన పోస్టులో ట్రంప్ తీవ్రంగా స్పందిస్తూ, “కెనడా గల్ఫ్‌స్ట్రీమ్ ఉత్పత్తులను అమ్మకుండా అడ్డుకుంటోంది. వెంటనే ఈ పరిస్థితిని సరిచేయకపోతే కెనడా విమానాలన్నింటిపైనా 50% టారిఫ్ విధిస్తాం” అని హెచ్చరించారు. కెనడాకు చెందిన ప్రముఖ విమాన తయారీ సంస్థ బాంబార్డియర్ తయారు చేసే గ్లోబల్ ఎక్స్‌ప్రెస్ బిజినెస్ జెట్లపై కూడా ఇదే సుంకాలు వర్తిస్తాయని తెలిపారు. అంతేకాదు, కెనడాలో తయారయ్యే అన్ని విమానాల ధృవీకరణను రద్దు చేసే చర్యలు తీసుకుంటామని ప్రకటించారు… ఈ పరిణామాలతో రెండు దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఇటీవల కెనడా ప్రధాని మార్క్ కార్నీతో ట్రంప్‌కు ఉన్న విభేదాలు మరింత తీవ్రమయ్యాయి. కెనడా చైనాతో వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటే అమెరికాకు వచ్చే కెనడియన్ వస్తువులపై 100 శాతం సుంకాలు విధిస్తామని కూడా ట్రంప్ హెచ్చరించారు. “కెనడా చైనాకు డ్రాప్ ఆఫ్ పోర్ట్ అవుతుందని భావిస్తే పొరపాటే” అంటూ కఠిన వ్యాఖ్యలు చేశారు. చైనా కెనడా ఆర్థిక వ్యవస్థను పూర్తిగా మింగేస్తుందని కూడా ఆరోపించారు…

ఈ పరిణామాలతో రెండు దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఇటీవల కెనడా ప్రధాని మార్క్ కార్నీతో ట్రంప్‌కు ఉన్న విభేదాలు మరింత తీవ్రమయ్యాయి. కెనడా చైనాతో వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటే అమెరికాకు వచ్చే కెనడియన్ వస్తువులపై 100 శాతం సుంకాలు విధిస్తామని కూడా ట్రంప్ హెచ్చరించారు. “కెనడా చైనాకు డ్రాప్ ఆఫ్ పోర్ట్ అవుతుందని భావిస్తే పొరపాటే” అంటూ కఠిన వ్యాఖ్యలు చేశారు. చైనా కెనడా ఆర్థిక వ్యవస్థను పూర్తిగా మింగేస్తుందని కూడా ఆరోపించారు… ఇదిలా ఉండగా, కెనడా ప్రధాని కార్నీ మాత్రం “కెనడా సార్వభౌమాధికారాన్ని అమెరికా గౌరవించాలి” అంటూ ట్రంప్ వ్యాఖ్యలకు సమాధానం ఇచ్చారు. బీజింగ్ పర్యటనలో చైనాతో ఆర్థిక సహకారంపై చర్చలు జరిపిన కార్నీ, అమెరికాతో ఉన్న అనిశ్చితి కంటే చైనాతో సంబంధాలు స్థిరంగా ఉంటాయని వ్యాఖ్యానించడం గమనార్హం. చైనా కూడా కెనడా వ్యవసాయ ఉత్పత్తులపై సుంకాలు తగ్గించే దిశగా ఒప్పందానికి వచ్చినట్లు సమాచారం.

క్యూబాపై ట్రంప్ ఒత్తిడి
మరోవైపు, ట్రంప్ క్యూబాపై కూడా ఆర్థిక ఒత్తిడి పెంచుతున్నారు. క్యూబాకు చమురు సరఫరా చేసే ఏ దేశంపైనైనా అదనపు టారిఫ్‌లు విధించేలా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు. అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం కింద ఈ ఉత్తర్వులు జారీ చేశారు. క్యూబా ప్రభుత్వం అమెరికా జాతీయ భద్రతకు ముప్పుగా మారిందని ట్రంప్ పేర్కొన్నారు. ఈ నిర్ణయం మెక్సికోపై కూడా ప్రభావం చూపుతోంది. ఇప్పటివరకు క్యూబాకు చమురు సరఫరాలో మెక్సికో కీలక పాత్ర పోషించింది. అయితే ఇటీవల మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షేన్‌బామ్ క్యూబాకు చమురు సరఫరాను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఇది అమెరికా ఒత్తిడితో తీసుకున్న నిర్ణయం కాదని, స్వతంత్రంగా తీసుకున్న నిర్ణయమని స్పష్టం చేశారు.

ప్రస్తుతం క్యూబా తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఇంధన కొరత, విద్యుత్ కోతలు, ఆహార సమస్యలు తీవ్రంగా ప్రభావం చూపుతున్నాయి. వెనెజువెలా సరఫరాలు తగ్గిపోవడం, మెక్సికో కూడా తగ్గించడం వల్ల పరిస్థితి మరింత క్లిష్టంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ తీసుకుంటున్న తాజా చర్యలు క్యూబాను పూర్తిగా ఒంటరిచేసే ప్రయత్నంగా విశ్లేషకులు భావిస్తున్నారు. ట్రంప్ టారిఫ్ రాజకీయాలు ఉత్తర అమెరికా వాణిజ్య సమీకరణాలను కుదిపేస్తున్నాయి. కెనడా, మెక్సికో, క్యూబా దేశాలపై వరుసగా ఒత్తిడి పెంచుతూ అమెరికా తన ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకునే దిశగా కఠిన వైఖరి అవలంబిస్తోంది. ఈ పరిణామాలు రాబోయే రోజుల్లో అంతర్జాతీయ వాణిజ్య రంగంపై మరింత ప్రభావం చూపే అవకాశముంది…