అరెస్టులు, శిక్షలు తప్పడం లేదు: చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి..
వైసీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనపై కొనసాగుతున్న అరెస్టులు, కేసులపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని అక్రమ పెట్టినా తాను భయపడే వ్యక్తిని కాదని, తన పోరాటం కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేసింది
తాను, చంద్రబాబు నాయుడు ఇద్దరూ ఒకే ఊరి నుంచి రాజకీయంగా ఎదిగినవారని, తన ఎదుగుదలను చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని చెవిరెడ్డి సమాచారం. 2014 నుంచి 2019 వరకు తనపై సుమారు 72 అక్రమ కేసులు బనాయించి, చిత్తూరు జిల్లాలోని అన్ని జైళ్లకు తిప్పారని గుర్తుచేశారు.
కళ్లకు గంతలు కట్టి తీసుకెళ్లి దాడి చేశారు
గతంలో తనను అక్రమంగా అరెస్టు చేసి కడప, నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించి అక్కడ కొట్టించారని చెవిరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యేగా ఉన్న తనను కళ్లకు గంతలు కట్టి తీసుకెళ్లి తిరువళ్ళూరు ప్రాంతంలో దాడి చేసినట్లు తెలిపారు. చిత్తూరు నుంచి నెల్లూరుకు ఎందుకు తీసుకెళ్లారో ఇప్పటికీ తనకు తెలియదని వాపో
చంద్రబాబు నాయుడు మళ్లీ ముఖ్యమంత్రి అయిన తర్వాత తనను అక్రమ కేసుల్లో ఇరికించి సుమారు 8 నెలల పాటు జైల్లో నిర్బంధించారని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. రాజకీయ కక్షతోనే తనపై ఈ చర్యలు జరుగుతున్నాయని, అయినప్పటికీ ప్రజల కోసం తన పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.
తన కుటుంబంపై కూడా కక్ష సాధింపులు జరుగుతున్నాయని, ఎమ్మెల్యేగా పోటీ చేసిన తన పెద్ద కొడుకుపై ఇప్పటికే 10 కేసులు పెట్టారని, విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న చిన్న కొడుకును కూడా అరెస్టు చేస్తామని బెదిరిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు పుట్టిన ఊరిలో పుట్టడమే మేం చేసిన తప్పా? అని ప్రశ్నించారు. ఒకవేళ తన తల్లిదండ్రులు బతికి ఉంటే వారిపై కూడా కేసులు పెట్టేవారేమోనని ఎద్దేవా చేశారు. తాను రాజకీయాల్లోకి పైరవీలతో రాలేదని, పోరాటాల ద్వారా వచ్చానని స్పష్టం చేశారు.
రాజారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, జగన్ మోహన్ రెడ్డి వంటి మూడు తరాల నాయకులతో కలిసి పని చేసిన అనుభవం తనకు ఉందని, ఎన్ని వేధింపులు గురిచేసినా, అసత్య ప్రచారాలు చేసినా తాను భయపడనని చెవిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఇవన్నీ ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చిన తాను దేనికీ వెనకడుగు వేయబోనని స్పష్టం చేశారు. అక్రమ కేసులో 8 నెలలపాటు పాటు జైల్లో ఉంచినప్పటికీ, తన పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.
లిక్కర్ స్కామ్ కేసు
ఆంధ్రప్రదేశ్లో వేల కోట్ల మద్యం కుంభకోణం జరిగిందన్న ఆరోపణలతో 2025 జూన్ 17న బెంగళూరు విమానాశ్రయంలో సిట్ (SIT) అధికారులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఆయనను ఏ-38గా పేర్కొన్నారు. సుమారు 226 రోజుల పాటు విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయనకు, వెన్నునొప్పి సమస్య కారణంగా ఉండవల్లిలోని మంతెన సత్యనారాయణరాజు ప్రకృతి చికిత్సాలయంలో ఫిజియోథెరపీ చేయించుకునేందుకు ఏసీబీ కోర్టు 15 రోజుల పాటు అనుమతినిచ్చింది. చివరకు జనవరి 29, 2026న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో ఆయనకు ఊరట లభించింది.