కేసీఆర్‌ కు సిట్ అధికారులు మరోసారి నోటీసులు..!

ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌(KCR )కు సిట్ అధికారులు మరోసారి నోటీసులు పంపారు. మున్సిపల్ ఎన్నికలు అభ్యర్థులను ఖరారు చేసే పనిలో బిజీగా ఉన్నానని లేఖ రాయడంతో శుక్రవారం విచారణను వాయిదా వేసిన అధికారులు నందినగర్‌లోని నివాసంలో శుక్రవారం నోటీసులను అంటించి వెళ్లారు. ఫిబ్రవరి 1వ తేదీ(ఆదివారం) మధ్యాహ్నాం 3 గంటలకు విచారణ జరుపుతామని పేర్కొన్నారు..ఇకపై ఏ నోటీసులైనా ఎర్రవల్లికే పంపాలని, 65 ఏళ్లు పైబడినందున సెక్షన్ 160 సీఆర్పీసీ ప్రకారం తాను పోలీస్ స్టేషన్‌కు రానని, ఉన్నచోటనే తనను విచారించాలని కేసీఆర్ చేసిన వినతిని అధికారులు తిరస్కరించారు. నందినగర్‌లోని నివాసంలో శుక్రవారం అధికారులు నోటీసులను అంటించి వెళ్లారు. ఫిబ్రవరి 1వ తేదీ(ఆదివారం) మధ్యాహ్నాం 3 గంటలకు విచారణ జరుపుతామని పేర్కొన్నారు..