బీఆర్ఎస్ పార్టీ నేతల పైన కాంగ్రెస్ నాయకుల దాడిని తీవ్రంగా ఖండించిన ..కేటీఆర్

బీఆర్ఎస్ పార్టీ నేతల పైన కాంగ్రెస్ గుండాల దాడిని తీవ్రంగా ఖండించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డితో ఫోన్లో మాట్లాడిన కేటీఆర్.. వివరాలు అడిగి తెలుసుకుని పార్టీ అండగా ఉంటుందన్నారు.

వెంటనే మేడ్చల్ జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే వివేక్ లను మల్లారెడ్డి, రాజశేఖర్ రెడ్డి వద్దకు వెళ్లాలని సూచించిన కేటీఆర్.

జూబ్లీహిల్స్ లో కార్పొరేటర్ దేదీప్యపైన ఎమ్మెల్యే నవీన్ యాదవ్, ఆయన అనుచరులు చేసిన దాడిని ఖండించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్..

దేదీప్యతో ఫోన్లో మాట్లాడి ధైర్యంగా ఉండాలన్న కేటీఆర్.. మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మరియు ఇతర నగర నేతలు దేదీప్యను వివరాలు అడిగి తెలుసుకున్నారు..