జగన్ ఎక్కడ అడుగు పెడితే అక్కడ అరిష్టం జరుగుతోంది” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసినమాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు…

మాజీ ముఖ్యమంత్రి జగన్ పర్యటించిన ప్రాంతాల్లో అనూహ్యంగా చోటుచేసుకుంటున్న సంఘటనలపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. “జగన్ ఎక్కడ అడుగు పెడితే అక్కడ అరిష్టం జరుగుతోంది” అంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన జగన్ పర్యటనల సందర్భంలో ఇద్దరు అమాయక వ్యక్తులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని, ఇవన్నీ పాలకుల బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని ఆయన విమర్శించారు. ప్రజల ప్రాణాల కంటే రాజకీయ ప్రచారానికే వైకాపా ప్రాధాన్యత ఇస్తోందని ఆయన ఆరోపించారు…జగన్ కాన్వాయ్, భారీ కారు ర్యాలీల కారణంగా సామాన్య వాహనదారులు నరకయాతన అనుభవిస్తున్నారని దేవినేని ఉమా పేర్కొన్నారు. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోవడంతో కార్యాలయాలకు వెళ్లేవారు, విద్యార్థులు గంటల తరబడి రోడ్లపైనే వేచి ఉండాల్సి వస్తోందని మండిపడ్డారు. భద్రత పేరుతో రోడ్లను దిగ్బంధించడం వల్ల నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాల్లో జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమవుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు..