ఎక్స్‌అఫీషియో సభ్యుల ఓట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కీలక సర్క్యూలర్ విడుదల ..!

*తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కీలక సర్క్యులర్ విడుదల*

*మున్సిపల్ ఛైర్‌పర్సన్, వైస్ ఛైర్‌పర్సన్ ఎన్నికలపై స్పష్టత ఇచ్చిన SEC*

*హైకోర్టు తీర్పు మేరకు కొత్త మార్గదర్శకాలు జారీ*

*ఎక్స్‌ ఆఫిషియో సభ్యుల అర్హతలపై ఎన్నికల కమిషన్ క్లారిటీ*

*మున్సిపల్ ప్రాంతంలో ఓటర్‌గా రిజిస్టర్ అయితేనే అర్హత*

*లోక్‌సభ MP, ఎమ్మెల్యేలకు ప్రత్యేక నిబంధనలు*

*రాజ్యసభ MP, ఎమ్మెల్సీకి కూడా ఓటర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి*

*అర్హతలేని సభ్యులకు ఓటు హక్కు ఉండదు*

*అర్హత లేకుండా వేసిన ఓటు చెల్లదు — ఎన్నికల కమిషన్ హెచ్చరిక*

*అర్హత లేని వ్యక్తిని సభ్యుడిగా పరిగణించరు*

*మున్సిపల్ ఎన్నికల అమలుకు అధికారులకు ఆదేశాలు*

*రాష్ట్రవ్యాప్తంగా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లకు సర్క్యులర్ పంపిణీ*

రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అత్యధిక మున్సిపాటీల్లో, కార్పోరేషన్లలో విజయం సాధించింది. అయితే, పలు మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది. ఆ మున్సిపాలిటీల్లో ఎవరికి స్పష్టమైన మెజార్టీ రాకపోవటంతో క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో కొన్ని మున్సిపాలిటీల్లో ఎక్స్‌అఫీషియో సభ్యుల ఓట్లు కీలకంగా మారాయి. తాజాగా.. ఎక్స్ అఫీషియో సభ్యుల ఓట్లపై తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కీలక సర్క్యూలర్ విడుదల చేసింది..

రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపిన వివరాల ప్రకారం.. మున్సిపల్ ప్రాంతంలో ఓటరుగా రిజిస్టర్ అయితేనే అర్హత ఉంటుందని తెలిపింది. లోక్‌సభ ఎంపీ, ఎమ్మెల్యేలకు ప్రత్యేక నిబంధనలు ఉంటాయి. అదేవిధంగా రాజ్యసభ ఎంపీ, ఎమ్మెల్సీలకు కూడా ఓటర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా ఉండాలి. అర్హత లేని సభ్యులకు ఓటు హక్కు ఉండదు. అర్హత లేకుండా వేసిన ఓటు చెల్లదని ఎన్నికల కమిషన్ తెలిపింది. అర్హత లేని వ్యక్తిని సభ్యుడిగా పరిగణించరు.

ఇదిలాఉంటే.. మేయర్, చైర్మన్ ఎన్నికలపై ఎస్ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. టీఎం యాక్ట్-2019 ప్రకారం ప్రత్యేక సమావేశానికి ఫారం-II నోటీసు కలెక్టర్లు విడుదల చేయాలని ఈసీ ఆదేశించింది. 16వ తేదీ మధ్యాహ్నం 12:30 గంటలకు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల కోసం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయనున్నారు.