చెన్నూరు మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ అరెస్ట్‌పై మాజీమంత్రి హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాల్క సుమన్ అరెస్ట్‌ను తాము ఖండిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ మార్క్ గూండాగురి రాజ్యమేలుతోందంటూ మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికార బలంతో అరాచక పాలన సాగిస్తోందని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. క్యాతనపల్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ స్పష్టమైన మెజార్టీ సాధించినప్పటికీ, ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కి చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవాలని కాంగ్రెస్ చూస్తోందని మాజీమంత్రి హరీశ్ రావు విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది అని ధ్వజమెత్తారు. అధికారం, పోలీస్, ధన బలంతో చట్టాలను కాంగ్రెస్ పార్టీ నేతలు తుంగలో తొక్కారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కాంగ్రెస్ అరాచక వైఖరికి పరాకాష్టగా మాజీమంత్రి హరీశ్ రావు అభివర్ణించారు.‘కాంగ్రెస్ మార్క్ గూండాగిరి రాజ్యమేలుతోంది. హంగ్ వచ్చిన చోట కిడ్నాప్‌లు చేస్తున్నారు. అడ్డదారుల్లో చైర్మన్ పీఠాలు దక్కించుకుంటున్నారు. భూములు కబ్జా చేసినట్లే పదవులు కబ్జా చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను పోలీసులు తక్షణమే విడుదల చేయాలి అని మాజీమంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు.
అధికార పార్టీకి పోలీసులు తొత్తులుగా మారొద్దు: మాజీమంత్రి హరీశ్ రావు
మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను అక్రమంగా అరెస్ట్ చేయడం కాంగ్రెస్ అరాచక వైఖరికి పరాకాష్ట అని… ఇలాంటి చర్యలను ప్రజలు గమనిస్తున్నారని మాజీమంత్రి హరీశ్ రావు హెచ్చరించారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని…అధికార పార్టీకి తొత్తులుగా మారవద్దని వార్నింగ్ ఇచ్చారు. ఎన్నికల ఫలితాలను గౌరవించాలని, అడ్డదారుల్లో పదవుల కోసం ప్రయత్నించడం మానుకోవాలని హితవు పలికారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న అణచివేత ధోరణిపై బీఆర్ఎస్ శ్రేణులు ఐక్యంగా పోరాడుతాయని మాజీమంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు.