టీవీ సౌండ్ తగ్గించమన్నందుకు భర్తను కత్తితో పొడిచి చంపిన భార్య.
ఏపీ – మంగళగిరి మండలం: పెదవడ్లపూడిలో కుటుంబ కలహాలు విషాదానికి దారితీశాయి. టీవీ సౌండ్ తగ్గించమన్న విషయంపై జరిగిన వాగ్వాదం చివరికి హత్యకు దారితీసింది.
పోలీసుల సమాచారం ప్రకారం, పెదవడ్లపూడికి చెందిన షేక్ అహ్మద్ (26) ఏసీ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. ఏడాదిన్నర క్రితం క్రాంతి అనే మహిళతో పరిచయం ఏర్పడి, అది వివాహేతర సంబంధంగా మారింది. అనంతరం ఇద్దరూ పెళ్లి చేసుకుని కలిసి నివసిస్తున్నారు..
క్రాంతికి గతంలోనే వివాహం కాగా, ఆమె భర్త ఓ నేరంలో జైలులో ఉన్నట్టు తెలుస్తోంది. ఆ తరువాత షేక్ అహ్మద్‌ను రెండో వివాహం చేసుకుంది..
గురువారం రాత్రి ఇంట్లో టీవీ సౌండ్ తగ్గించమన్న అహ్మద్‌తో క్రాంతికి వాగ్వాదం జరిగింది. ఆగ్రహంతో క్రాంతి కత్తితో అహ్మద్‌ను పొడిచినట్టు సమాచారం. తీవ్రంగా గాయపడిన అహ్మద్‌ను ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.
ఏడాదిన్నర క్రితం మంగళగిరికి చెందిన క్రాంతి అనే మహిళతో పరిచయంవివాహేతర సంబంధానికి దారితీసింది. క్రాంతికి గతంలోనే పెళ్లయింది. మొదటి భర్త జైలులో ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో అహ్మద్‌ను వివాహం చేసుకుని మంగళగిరి టిడ్కో ఇళ్లలో బీ-16 బ్లాకులో నివసిస్తున్నారు. గురువారం రంజాన్ ఉపవాస దీక్షలో ఉన్న అహ్మద్ ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో భార్య పెద్ద శబ్ధంతో టీవీ చూస్తోంది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. క్రాంతిని అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.
సౌండ్ తగ్గించమని చెప్పడంతో క్రాంతి ఆగ్రహంతో కత్తితో భర్తను పొడిచింది. తీవ్రంగా గాయపడిన అహ్మద్‌ను విజయవాడ ప్రభుత్వవైద్యశాలకు తరలిస్తుండగా మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. మృతుడి తల్లి మహాబీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు మంగళగిరి పట్టణ సీఐ కె.వీరాస్వామి తెలిపారు.. గతంలో కూడా ఎంత టార్చర్ చేస్తే ఇంత కోపం వచ్చుంటుందో అంటూ మరికొందరు ఆమెకి అనుకూలంగా పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు..