నేను కూడా వాళ్లతో పడుకోవడానికి ఒప్పుకున్నాను…

గ్లామర్ వరల్డ్‌లో ‘ఇమేజ్’ కాపాడుకోవడం కోసం సెలబ్రిటీలు ఎంతగా తాపత్రయ పడతారో మనకు తెలిసిందే. తమ పర్సనల్ లైఫ్‌లోని చీకటి కోణాలను, చేసిన తప్పులను బయటపెట్టడానికి అస్సలు ఇష్టపడరు. అంతా పర్ఫెక్ట్ అన్నట్లే కలర్ ఇస్తుంటారు. కానీ, ఇందుకు భిన్నంగా ఓ హీరోయిన్ మాత్రం ఇండస్ట్రీ మొత్తం షాక్ అయ్యేలా ఓ నిజాన్ని నిర్భయంగా ఒప్పుకుంది. “అవును.. కష్టాల్లో ఉన్నప్పుడు డబ్బు కోసం నేను పరాయి మగవాళ్లతో పడుకున్నాను” అంటూ పబ్లిక్‌గా స్టేట్‌మెంట్ ఇచ్చింది. అంతేకాదు, ఓ బడా పొలిటీషియన్ కొడుకు తనను ఎలా మోసం చేశాడో కూడా బయటపెట్టింది. ఇంతకీ ఆ డేరింగ్ లేడీ ఎవరో కాదు.. షెర్లిన్ చోప్రా (Sherlyn Chopra)….సోషల్ మీడియాలో పేలిన బాంబ్.. ఇది ఇప్పటి మాట కాదు, 2012లోనే షెర్లిన్ చోప్రా తన ట్విట్టర్ (Twitter) ఖాతా ద్వారా కొన్ని సంచలన నిజాలను బయటపెట్టింది. అప్పట్లో ఆమె చేసిన ట్వీట్స్ చూసి బాలీవుడ్ మొత్తం ఉలిక్కిపడింది. “నాకు ట్విట్టర్ ఇన్‌బాక్స్‌లో, అఫీషియల్ మెయిల్స్‌లో చాలా మంది మగవాళ్లు మెసేజ్‌లు చేసేవారు. డబ్బులిస్తాం.. పడక సుఖం కావాలి అని అడిగేవారు. ఆ టైమ్‌లో నాకు డబ్బు అవసరం బాగా ఉండటంతో.. నేను కూడా వాళ్లతో పడుకోవడానికి ఒప్పుకున్నాను” అని బాంబ్ పేల్చింది. అయితే ఆ అనుభవాలు తనకేమీ ఆనందాన్ని ఇవ్వలేదని, కేవలం అవసరం కోసమే చేశానని కుండబద్దలు కొట్టింది..ఎందుకంత ఓపెన్‌గా చెప్పేసింది? సాధారణంగా ఇలాంటి విషయాలు బయటపడితే కెరీర్ నాశనం అవుతుందని భయపడతారు. కానీ షెర్లిన్ మాత్రం “నా గతం గురించి జనాలకు తెలియాలి, నేను మారాను అని నిరూపించుకోవాలి అంటే.. ముందు నా తప్పులను నేనే ఒప్పుకోవాలి” అనే ఉద్దేశంతోనే ఈ కన్ఫెషన్ చేసినట్లు తెలిపింది. సింపతీ కోసమో, పబ్లిసిటీ కోసమో తానీ పని చేయలేదని, కేవలం నిజాయితీగా ఉండాలనే ఈ నిజాన్ని బయటపెట్టానని క్లారిటీ ఇచ్చింది. “నేను ఒకప్పుడు అలా ఉండేదాన్ని.. ఇప్పుడు కొత్త మనిషిని” అని చెప్పడమే ఆమె ఉద్దేశం.
ఇంటర్నేషనల్ రేంజ్‌లో క్రేజ్ షెర్లిన్ చోప్రా అంటేనే బోల్డ్‌నెస్‌కు కేరాఫ్ అడ్రస్. ఇండియన్ సినిమా చరిత్రలో ‘ప్లేబాయ్’ (Playboy) మ్యాగజైన్ కోసం న్యూడ్‌గా ఫొటోషూట్ చేసిన తొలి భారతీయ మహిళగా ఆమె రికార్డు సృష్టించింది. ఆ ఫొటోషూట్ అప్పట్లో ఇంటర్నేషనల్ లెవల్లో వైరల్ అయ్యింది. సినిమాల విషయానికి వస్తే.. ‘కామసూత్ర 3D’, ‘మాయ’ వంటి సినిమాల్లో ఆమె చేసిన ఘాటు రోల్స్ కుర్రకారును ఉక్కిరిబిక్కిరి చేశాయి. బిగ్ బాస్, MTV స్ప్లిట్స్ విల్లా వంటి షోల ద్వారా కూడా ఆమె తనదైన ముద్ర వేసింది..

కామసూత్ర త్రీడీ సినిమా ద్వారా ప్రపంచ వ్యాప్తంగా పేరు సంపాదించుకున్న భామ షెర్లీన్ చోప్రా, పాత్ర కోరితే ఎలాంటి బోల్డ్ సీన్ లో అయినా నటించే ఈ భామ తెలుగులో ఎ ఫిలిం బై అరవింద్ సినిమాలో సైతం నటించింది.