వారి మాటలవల్లనే మేము టీ20 ప్రపంచకప్ 2026లో ఆడలేకపోయాం..!

ప్రపంచకప్ 2026 ప్రారంభానికి ముందే ఆసియా క్రికెట్‌లో పెద్ద దుమారమే రేగింది. భారత్‌లో పర్యటించేందుకు నిరాకరించిన బంగ్లాదేశ్‌పై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) కఠిన చర్యలు తీసుకుంది…ఆ జట్టును టోర్నీ నుంచి తప్పించి, దాని స్థానంలో స్కాట్లాండ్‌కు అవకాశం కల్పించింది. అయితే, బంగ్లాదేశ్ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) కుట్ర ఉందనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి.బంగ్లాదేశ్ కు చెందిన ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) మాజీ సీఈవో సయ్యద్ అష్రఫుల్ హక్ మాట్లాడుతూ.. పాక్ బోర్డు అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీ వేసిన ఉచ్చులో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) చీఫ్ అమీనుల్ ఇస్లాం చిక్కుకున్నారని ఆరోపించారు. “భారత్‌లో పర్యటించవద్దని, తాము అండగా ఉంటామని పాక్ బోర్డు హామీ ఇచ్చింది. కానీ ఐసీసీ చర్యలు తీసుకుంటామని హెచ్చరించగానే పాక్ మాట మార్చింది. చివరికి నష్టపోయింది బంగ్లాదేశ్ మాత్రమే” అని ఆయన విశ్లేషించారు..