తెలంగాణ, ఏపీ రాష్ట్రాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల శిక్షణా తరగతులు హాజరు కానున్న సీఎం రేవంత్ రెడ్డి..

నేడు వికారాబాద్ కు సీఎం రేవంత్ రెడ్డి..

_• మధ్యాహ్నం 2 గంటలకి అనంతగిరి హిల్స్ చేరుకోనున్న సీఎం రేవంత్..

హరిత రిసార్ట్స్ లో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల శిక్షణా తరగతులు..

_• తరగతుల ప్రారంభం కార్యక్రమానికి హాజరుకానున్న సీఎం రేవంత్.._
_• సాయంత్రం 4గంటలకి తిరిగి హైదరాబాద్ చేరుకోనున్న రేవంత్ రెడ్డి..

మంత్రులు రోడ్డు మార్గంలో.. సీఎం హెలీకాప్టర్లో చేరుకోనున్నారు. పది రోజుల పాటు ఆంధ్రప్రదేశ్కు చెందిన 41 మంది, తెలంగా ణకు చెందిన 36 డీసీసీ అ«ధ్యక్షులు శిక్షణ తీసుకోనున్నారు.సీఎం మధ్యాహ్నం 1.30 గంటలకు హైదరా బాద్ నుంచి హెలీకాప్టర్లో బయలు దేరి 1.45గంటలకు వికారాబాద్లోని ఎస్ఏపీ కళాశాల మైదానానికి చేరుకుంటారు.

అక్కడ జిల్లా ఎమ్మెల్యేలు, నేతలు స్వాగతం పలుకుతారు. అక్కడి నుంచి రో డ్డు మార్గంలో అనంతగిరికి చేరుకుంటారు. మధ్యా హ్నం 3గంటలకు శిక్షణ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం హెలీకాప్టర్ లో తిరిగి హైదరాబాద్ కు వెళ్తారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను శుక్రవారం శిక్షణ తరగతుల నిర్వహణ కమిటీ చైర్మ న్, పరిగి ఎమ్మెల్యే టీ రామ్మోహన్రెడ్డి, కలెక్టర్ ప్రతీక్ జైన్, పోలీసు ఉన్నతాధికారులు పర్యవేక్షించారు..