రాజమండ్రి :
ఏపీలో 2027లో జరగనున్న గోదావరి పుష్కరాలను మహా కుంభమేళా తరహాలో నిర్వహించాలని రాష్ట్ర దేవాదాయ శాఖమంత్రి
ఆనం రాంనారాయణ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ ఉపసంఘ భేటీలో నిర్ణయించారు. జూన్ 26 నుంచి జులై 7 వరకు 6 జిల్లాల్లో జరిగే ఈ వేడుకలకు సుమారు 10 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా.ఈ వేడుకల్లో భాగంగా 369 స్నాన ఘట్టాలు, భక్తుల కోసం టెంట్ సిటీలు, హోమ్ స్టేలు, 434 ఆలయాల మరమ్మతులు వంటి భారీ ఏర్పాట్లు చేయనున్నారు.