గ్రూప్-1 బ్యాచ్ అధికారులకు సుప్రీంకోర్టు (Supreme Court)లో ఎదురుదెబ్బ…

2018 ఆంధ్రప్రదేశ్ గ్రూప్-1 బ్యాచ్ అధికారులకు సుప్రీంకోర్టు (Supreme Court)లో ఎదురుదెబ్బ తగిలింది. హైకోర్టు(High Court) డివిజన్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ గ్రూప్ -1 అధికారులు వేసిన పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం కొట్టేసింది. అప్రాధాన్య పోస్టులకు బదిలీ చేయాలన్న ఆదేశాలను అధికారులు సవాల్ చేశారు. డివిజన్ బెంచ్ ఉత్తర్వులు సరిగానే ఉన్నాయని సుప్రీంకోర్టు తెలిపింది. ప్రాధాన్య పోస్టులు లేకపోతే ఉద్యోగాలు (Jobs) చేయలేరా అని ప్రశ్నించింది. ఎక్కడున్నా జీతం (Salary) వస్తుందని, సంతప్తి పడాలని పేర్కొంది…