ఓం శ్రీ గురుభ్యోనమః
🌿పంచాంగం🌿
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,
తేదీ … 02 – 03 – 2026,
వారం … ఇందువాసరే ( సోమవారం )
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
ఉత్తరాయనం,
శిశిర ఋతువు,
ఫాల్గుణ మాసం,
శుక్ల పక్షం,
తిథి : *చతుర్దశి* సా5.49 వరకు,
నక్షత్రం : *ఆశ్లేష* ఉ7.53 వరకు
యోగం : *అతిగండ* మ12.35 వరకు,
కరణం : *గరజి* ఉ6.26 వరకు
తదుపరి *వణిజ* సా5.49 వరకు,
ఆ తదుపరి *భద్ర* తె5.25 వరకు,
వర్జ్యం : *రా7.43 – 9.17*
దుర్ముహూర్తము : *మ12.35 – 1.21*
మరల *మ2.55 – 3.41*
అమృతకాలం : *ఉ7.53 వరకు*
మరల *తె5.11 నుండి*
రాహుకాలం : *ఉ7.30 – 9.00*
యమగండం : *ఉ10.30 – 12.00*
సూర్యరాశి : *కుంభం*
చంద్రరాశి : *సింహం*
సూర్యోదయం : 6.23,
సూర్యాస్తమయం : 6.02,
*_నేటి మాట_*
*మనం భగవంతుని అనుగ్రహం – ఎలా పొందాలి?*
ఈరోజుల్లో మనందరికీ తెలిసినది ఏమంటే, పూజలు, నోములు, వ్రతాలు, చేస్తే భగవద్ అనుగ్రహం పొందవచ్చు అని, అలా అయితే అందరం జీవన్ముక్తులమైనట్లే…
సముద్రంనుండి నీరు వేడిమికి ఆవిరై పైకిపోవుటచేత మేఘములు ఏర్పడి వర్షాలు పడి పంటలు పండుచున్నాయి…
నీరే పైకి ఆవిరి కాకున్నా వర్షాలు పడే అవకాశం లేదు,
అలాగే మనం చేసే ప్రార్థనలు పైకి చేరితేనే భగవంతుని ఆశిస్సులు కిందికి రాగలవు…
భగవంతుడున్నాడనే స్పృహ లేకుండా నిత్యం తీరిక లేని వారివలే, సంసార సాగరంలో, మునిగి ఉంటూంటే ఇంకా, భగవద్ అనుగ్రహం ఎక్కడి నుండి వస్తుంది?…
సరైన సాధన చేయకుండా మీనమేషాలు లెక్కపెడుతూ కూర్చుంటే వచ్చేవి చింతలే తప్ప ఇంకేమీ రావు…
నిత్యం సాధన చేయాలి, భగవంతుడిని అనుభవించాలి, ఏది జరిగినా ఆయన దయ అన్న భావం వుండాలి, అపుడే భగవదనుగ్రహం కలుగుతుంది…
*_🌿శుభమస్తు🌿_*
🙏సమస్త లోకా: సుఖినోభవంతు🙏