తెలంగాణలో 2025 ఏడాదికి సంబంధించి గద్దర్ అవార్డులు ప్రకటన.. మెగాస్టార్ చిరంజీవికి ఎన్టీఆర్ నేషనల్ అవార్డు..

మెగాస్టార్ చిరంజీవికి ఎన్టీఆర్ నేషనల్ అవార్డు

తెలంగాణలో 2025 ఏడాదికి సంబంధించి గద్దర్ అవార్డులు ప్రకటన

కమల్ హాసన్‌కు పైడి జయరాజ్ అవార్డు

జయసుధకు ఏఎన్నార్ అవార్డు

డైరెక్టర్ సింగీతం శ్రీనివాస రావుకు బీఎన్ రెడ్డి ఫిల్మ్ అవార్డు

ఆర్.నారాయణ మూర్తికి కాంతారావు అవార్డు

తెలుగు ప్రొడ్యూసర్ అశ్వినీ దత్‌కి నాగిరెడ్డి & చిత్రపాణి ఫిల్మ్ అవార్డు

పాటల రచయిత సుద్దాల అశోక్ తేజకు సి నారాయణరెడ్డి ఫిల్ అవార్డు..
తెలుగు చలనచిత్ర రంగంలో విశిష్ట ప్రతిభ కనబరిచిన కళాకారులకు ఇచ్చే ప్రతిష్టాత్మక ‘గద్దర్ అవార్డుల’ (2025) విజేతల జాబితా శనివారం అధికారికంగా విడుదలైంది. ఈ ఏడాది అత్యున్నత పురస్కారాల్లో భాగంగా చిత్రసీమకు చెందిన ఇద్దరు దిగ్గజ నటులకు అరుదైన గౌరవం దక్కింది. తెలుగు సినిమాకు మెగాస్టార్ చిరంజీవి అందించిన అసమానమైన సేవలకు గుర్తింపుగా ఆయనను ప్రతిష్టాత్మకమైన ‘ఎన్టీఆర్ జాతీయ పురస్కారం’తో ప్రభుత్వం సత్కరించనుంది. అలాగే వెండితెరపై తన విలక్షణ నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న లోకనాయకుడు కమల్ హాసన్‌ను ‘పైడి జయరాజ్ అవార్డు’ వరించింది. ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఈ స్పెషల్ జ్యూరీ అవార్డుల వివరాలను ప్రకటించారు. 2025 జనవరి 1 నుండి డిసెంబర్ 31 వరకు సెన్సార్ పూర్తి చేసుకున్న చిత్రాలు, షార్ట్ ఫిల్మ్‌ల నుండి ఈ ఎంపిక జరిగింది. ఈ ప్రతిష్టాత్మక జాబితాలో నటి జయసుధకు ‘ఏఎన్నార్ పురస్కారం’, ప్రముఖ నిర్మాత అశ్విని దత్‌కు ‘నాగిరెడ్డి చక్రపాణి అవార్డు’, గేయ రచయిత సుద్దాల అశోక్ తేజకు ‘సినారే అవార్డు’ దక్కాయి. ఈ పురస్కారాలను వచ్చే ఏడాది మార్చి 19న ఉగాది పర్వదినం సందర్భంగా అత్యంత వైభవంగా ప్రదానం చేయనున్నారు…

సాంకేతిక మరియు ఇతర విభాగాలు:
జాతీయ సమగ్రత చిత్రం: తండేల్..

ఉత్తమ సందేశాత్మక చిత్రం: కోర్ట్.

ఉత్తమ..డాక్యుమెంటరీ: యూనిటీ ఉత్తమ సంగీత దర్శకుడు: మార్క్ రాబిన్.. (దండోరా)

ఉత్తమ గాయకుడు: అనురాగ్ కులకర్ణి
(రాజు వెడ్స్ రాంబాయి)
ఉత్తమ గాయని: సాహితీ (కన్నప్ప) ఉత్తమ.

సహాయ నటుడు: శివాజీ
ఉత్తమ సహాయ నటి: భూమిక
(యూఫోరియా) పరిచయ దర్శకుడు: సాయి మార్తాండ్ (లిటిల్ హార్ట్స్) ఉత్తమ బాలల చిత్రం: అనగనగా ఉత్తమ బాలనటుడు: మాస్టర్ రోహన్ (ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో)..