పారిశుద్ధ్య కార్మికురాలు సెల్వీ నిజాయతీ..!

*చెత్తకుప్పలో బంగారం*

తమిళనాడులోని శివగంగకు చెందిన పారిశుద్ధ్య కార్మికురాలు సెల్వీ తన నిజాయతీతో అందరి ప్రశంసలు అందుకుంటోంది. ఆమెకు చెత్తలో రూ. 18 లక్షల విలువైన బంగారు ఆభరణాలు దొరికాయి. పిల్లలు పొరపాటున పడేసిన ఈ నగలను ఆమె పోలీసుల సహాయంతో యజమానులకు అప్పగించింది. సెల్వీ గొప్ప మనసును మెచ్చిన యజమానులు ఆమెకు రూ. 20 వేల బహుమతిని అందజేశారు. గతంలోనూ ఇక్కడి కార్మికులు ఇలాగే తమ నిజాయతీని చాటుకోవడం విశేషం…