లవంగాలు ఎన్ని రకాల వ్యాధులకు మందో తెలుసా?

లవంగాలు ఎన్ని రకాల వ్యాధులకు మందో తెలుసా? లవంగాలు తెల్ల రక్తాన్ని పెంచడంలో గ్రేట్ గా ఉన్నాయి. అలాగే జీవిత కాలాన్ని పెంపొందించే గుణాలు ఇందులో అధికంగా ఉన్నాయి. ఎసిడిటీ నుంచి తక్షణ ఉపశమనం లభించడానికి లవంగం నమలడం ఉపకరిస్తుంది. కడుపులో గ్యాస్ ఏర్పడకుండా ఇది చూస్తుంది. నోట్లో లవంగం ముక్క ఉంచుకొని మెల్లగా నమలడం వల్ల.. కడుపులో యాసిడ్ స్థాయిలు తగ్గుతాయి..యాంటీ మైక్రోబియల్, యాంటీసెప్టిక్ లక్షణాలు ఇన్ఫెక్షన్లు మన దగ్గరకు రాకుండా పోరాటం చేస్తాయి. ఇక శీతాకాలంలో చాలా మంది విపరీతమైన దగ్గుతో బాధపడుతూ ఉంటారు. పొడిదగ్గు, కఫంతో బాధపడే వారికి లవంగం చాలా బాగా పనిచేస్తుంది.ఇందులో ఉండే ఆంటీ ఆక్సిడెంట్ గుణాల వల్ల పొడిదగ్గు నయమవుతుంది. కఫం సమస్య బాగా తగ్గుతుంది.రోజు లవంగం టీ తాగితే జీర్ణక్రియ సమస్యలు దరిచేరవు. భోజనం చేసిన గంట తర్వాత లవంగం టి తీసుకోవడం వల్ల ఎసిడిటీ, మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది. లవంగాలు శరీరంలోని టాక్సిన్లను తొలగించి చర్మం మృదువుగా ఆరోగ్యంగా కనిపించేలా చేస్తాయి. చాలామంది పంటినొప్పితో బాధపడుతూ ఉంటారు. అటువంటివారు లవంగం టీ తాగడం వల్ల లేదా లవంగాలను నమలడం వల్ల పంటినొప్పి తగ్గడంతో పాటు నోటి దుర్వాసన కూడా దూరం అవుతుంది.

లవంగాలలో యుజైనాల్ అనే తైలం ఉంటుంది. ఇది శరీరంలోని వేడిని తగ్గిస్తుంది. కీళ్ల నొప్పులతో బాధపడేవారు రెగ్యులర్ గా లవంగాలను వాడడం వల్ల వారికి ఉపశమనం కలుగుతుంది. లవంగాలలో ఉండే యుజైనాల్ తైలం యాంటీసెప్టిక్ లా పనిచేసి పళ్ళ చిగుళ్ళను కాపాడుతుంది. పంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.లవంగాలు బ్లడ్ షుగర్ లెవెల్స్ ని బాగా కంట్రోల్ చేస్తాయని అధ్యయనాలు తేల్చాయి. డయాబెటిస్ తో బాధపడే వారికి లవంగాలు బాగా ఉపయోగపడతాయి. ఇవి శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతాయి అని చెబుతున్నారు. లవంగాలలో ఉండే విటమిన్ సి మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. రెగ్యులర్ గా లవంగాలను వాడటం వల్ల ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి.