నూతనం గా ఎన్నికైన మహిళా కౌన్సిలర్లకు సన్మానం..!

మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి..

మార్కెట్ కమిటీ చైర్మన్ దేశ్ముఖ్ రాధిక అరుణ్ కుమార్.

Sv చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్ కోతి సాయి శరణి సంపత్ రెడ్డి.మూడో వార్డ్ కౌన్సిలర్ సులువ నాగలక్ష్మి చంద్రశేఖర్…నూతనం గా ఎన్నికైన మహిళా కౌన్సిలర్స్ కి సన్మానం చేసిన మూడో వార్డు మహిళలు

మహిళా దినోత్సవ సందర్భంగా మూడో వార్డులో ఎస్వి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ రాధికారుణ్ కుమార్, ఎస్వి చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్ కోతి సాయి చరణ్ సంపత్ రెడ్డి మూడవ వార్డ్ కౌన్సిలర్ సులువ నాగలక్ష్మి చంద్రశేఖర్ పాల్గొనీ మాట్లాడుతు స్వాతంత్రం వచ్చి దాదాపు 70 ఏళ్ళు అవుతున్న కూడా ఇప్పటికీ ఆడవారిని వంటింటి పరిమితం చేస్తున్నారని, గాంధీజీ కలలు కన్నా స్వరాజ్యం ఇప్పటికీ రాలేదని, మహిళలు ఆర్థిక,రాజకీయం, విద్య,వ్యాపార రంగాలలో ముందుండాలని ఆడవాళ్ళ పట్ల వివక్షత చూపించడం సరైనది కాదని, ప్రస్తుతం హుజూర్నగర్ విధులు నిర్వహిస్తున్నటువంటి ఎమ్మార్వో కవిత ఎంపీ ఓ లావణ్య మార్కెట్ కమిటీ చైర్మన్ రాధికారుణ్ కుమార్ మహిళల కావడం గొప్ప విషయం అని ఇదే స్ఫూర్తితో కొనసాగిస్తూ రాబోయే రోజుల్లో అన్ని రంగాల్లో మహిళలు ముందుండాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మూడుసార్లు నేషనల్ అవార్డు పొందిన మాధవి స్పీచ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మహిళా దినోత్సవ వేడుకలలో మొదటి వార్డ్ కౌన్సిలర్ మోదాల సైదులు కామేశ్వరి రెండో వార్డ్ కౌన్సిలర్ కోడి ఉపేందర్ జ్యోతి 4 వార్డ్ కౌన్సిలర్ దొంత రెడ్డి పద్మ ఐదో వార్డ్ కౌన్సిలర్ ఎరగని సుష్మా మురళి, 14వ వార్డ్ కౌన్సిలర్ దగ్గుబాటి కవిత బాబురావు, 15వార్డ్ కౌన్సిలర్ నల్గొండ శ్రీధర్ సుజాత, 22వ వార్డు కౌన్సిలర్ అమరబోయిన సతీష్ ఊహ, అట్లూరి మంజుల హరిబాబు మరియు వార్డు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు..