పాత శాసనమండలి (Old Legislative Council) భవన ప్రాంగణంలో మంగళవారం ఒక్కసారిగా కలకలం రేగింది. భవన ఆవరణలో ఒక భారీ పాము ప్రత్యక్షం కావడంతో అక్కడ విధుల్లో ఉన్న సిబ్బంది, పోలీసులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అయితే, ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ సమయస్ఫూర్తితో వ్యవహరించి పెను ప్రమాదాన్ని తప్పించారు.మంగళవారం మధ్యాహ్నం భవనంలోని ఒక మూల పాము పాకుతూ రావడాన్ని గమనించిన సిబ్బంది ఒక్కసారిగా కేకలు వేశారు. పాము ఎటువైపు వస్తుందో తెలియక అక్కడున్న వారు అప్రమత్తమై పరుగులు తీశారు. అధికారులకు సమాచారం అందించే లోపే, అక్కడ డ్యూటీలో ఉన్న మలక్ పేట్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ వెంకటేష్ నాయక్ రంగంలోకి దిగారు. ఎటువంటి భయం లేకుండా, అత్యంత చాకచక్యంగా ఆ పామును వెంకటేష్ నాయక్ పట్టుకున్నారు. పాముకు ఎలాంటి గాయం కాకుండా, అలాగే అక్కడ ఉన్న వారికి ప్రమాదం కలగకుండా ఆయన దానిని బంధించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వెంకటేష్ నాయక్‌కు పాములను పట్టడంలో ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా పలు సందర్భాల్లో జనావాసాల్లోకి వచ్చిన పాములను ఆయన పట్టుకుని, సురక్షితంగా అటవీ ప్రాంతంలో వదిలిపెట్టి తన మానవత్వాన్ని, ధైర్యాన్ని చాటుకున్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.