ఇంధన సంక్షోభంపై కీలక చర్చలు..ప్రధాని మోదీ హైలెవల్ మీటింగ్..!

పశ్చిమ ఆసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, ప్రపంచ ఇంధన మార్కెట్‌లో నెలకొన్న అస్థిరత నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశంలో పెట్రోలియం, విద్యుత్, ఎరువులు వంటి నిత్యావసర వనరుల సరఫరాకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా రంగంలోకి దిగారు. ఆదివారం సీనియర్ మంత్రులు, ఉన్నతాధికారులతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.

(Narendra Modi) ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. యుద్ధం కారణంగా భారత్‌లో గ్యాస్ నిల్వలు, విద్యుత్, ఎరువులు సరిపోను ఉన్నాయా? లేదా? అనే అంశంపై కేంద్ర మంత్రులతో ఆదివారం ప్రధాని ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అత్యవసరాలైన గ్యాస్, విద్యుత్, ఎరువుల పంపిణీలో అంతరాయం లేకుండా చూడాలని మోడీ సూచించారు…మూడు వారాలకు పైగా జరుగుతున్న పశ్చిమాసియా యుద్ధం ప్రభావంతో భారత్‌ ఇంధన కొరత, గ్యాస్ సరఫరాపై అనిశ్చితి నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. దేశ ప్రజల్లోని భయాలను తొలగించాలనే ఉద్దేశంతో ప్రధానంగా ఇంధన భద్రత, సరిపోను నిల్వలు ఉండేలా చూసుకోవడం, ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులను గమనించడం వంటి వాటిపై దృష్టి సారించారు…

గ్యాస్, ముడి చమురు, విద్యుత్, ఎరువులు వంటి వాటిని నిరంతర సరఫరా చేయడం, వీటి పంపిణీలో అలసత్వం ప్రదర్శించకూడదనే అంశాలపై కేంద్ర మంత్రులతో మోడీ చర్చించారు. ప్రధాని నివాసంలో జరిగిన ఈ అత్యవసర భేటీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశీ వ్యవహారాల శాఖామాత్యులు ఎస్‌.జైశంకర్, పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ, ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా పాల్గొన్నారు.

కీలక నిర్ణయాలివే..

అత్యవసర సమావేశంలో మంత్రి వర్గంతో చర్చించిన మోడీ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రస్తుతానికి మధ్యంతర చర్యల్లో భాగంగా కేంద్రం అన్ని రాష్ట్రాలకు కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల సరఫరాను పెంచింది. విద్యా కేంద్రాలు, ఆస్పత్రులకు గ్యాస్ పంపిణీకి ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపింది. గృహోపయోగానికి, కమర్షియల్ వినియోగదారులకు కొత్తగా పీఎన్‌జీ(పైప్‌డ్ నేచురల్ గ్యాస్) కనెక్షన్లు ఇవ్వాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది..

జాతీయ స్వభావానికి పరీక్షా సమయం
ఈ సంక్షోభ పరిస్థితులపై ప్రధాని మోదీ స్పందిస్తూ.. ఇది మన దేశ సామర్థ్యానికి, సహనానికి ఒక కీలక పరీక్ష అని అభివర్ణించారు. పశ్చిమ ఆసియా సంఘర్షణ వల్ల తలెత్తిన ఇంధన సంక్షోభాన్ని అధిగమించేందుకు ప్రజా చైతన్యం, ప్రభుత్వ కృషీ తోడవాలని ఆయన ఆకాంక్షించారు. సరఫరా గొలుసులో తలెత్తే అడ్డంకులను అధిగమించేందుకు నిరంతర ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన హామీ ఇచ్చారు.

హోర్ముజ్ జలసంధిపై ఆందోళన
ప్రపంచ ఇంధన రవాణాలో దాదాపు 20 శాతం వాటా కలిగిన హోర్ముజ్ జలసంధి ప్రస్తుతం ప్రధాన ఆందోళనకర అంశంగా మారింది. ఇరాన్ ఈ మార్గంపై పట్టు సాధించి నౌకల రాకపోకలను పరిమితం చేయడం వల్ల భారతదేశానికి చేరే చమురు సరఫరాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కొనసాగుతున్న దాడులు, ప్రతీకార దాడుల వల్ల ఈ కీలక జలమార్గం యుద్ధ భూమిగా మారింది..