శాస్త్ర విరుద్ధంగా ప్రవర్తించిన ప్రధాన అర్చకుడు పై చర్యలు తీసుకోవాలి..రాధాకృష్ణ డిమాండ్..

యాదాద్రి భువనగిరి జిల్లా:

శాస్త్ర విరుద్ధంగా ప్రవర్తించిన ప్రధాన అర్చకుడు పై చర్యలు తీసుకోవాలి..

జాతా శౌచం ఉన్నప్పటికీ యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలలో పాల్గొని శాస్త్ర విరుద్ధంగా ప్రవర్తించి హిందూ ధర్మానికి విఘాతం కలిగించే వ్యవహరించిన యాదగిరిగుట్ట దేవస్థానం ప్రధాన అర్చకుడు కాండూరి వెంకటాచార్యులు ముఖ్య అర్చకులు కాండూరి శ్రీనివాసచార్యులపై తగిన చర్యలు తీసుకోవాలని బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షులు నల్ల రాధాకృష్ణ డిమాండ్ చేశారు…

ఆదివారం ఆయన పలు హిందూ సంఘాల నేతలతో కలిసి యాదగిరిగుట్ట దేవస్థానం ఈవో జె భవాని శంకర్ కు ఈ మేరకు ఫిర్యాదు చేశారు..

అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ యాదగిరిగుట్ట దేవస్థానంలో ప్రధాన అర్చకుడిగా పనిచేస్తున్న కాండూరు వెంకటాచార్యులు శాస్త్రానికి ఆలయ సంప్రదాయాలకు విరుద్ధంగా ప్రవర్తించారని ఆరోపించారు..

కాండూరు వెంకటాచార్యులు సొంత పాలి బంధువైన కాండూరి భార్గవ్ కు శిశువు జన్మించగా హిందూ శాస్త్ర ప్రకారం శిశువు జన్మించిన రోజు నుండి ఆ కుటుంబానికి చెందిన వారికి జత శౌచం పది రోజులపాటు ఉంటుందని తెలిపారు..

ఈ సమయంలో ఆయన ఆలయానికి వెళ్లడం పూజలు చేయడం ఇతర ధార్మిక కార్యక్రమాలలో పాల్గొనడం చేయకూడదని తెలిపారు..

సొంత పాలుబంధు అయినప్పటికీ వెంకటాచార్యులతో పాటు ముఖ్య అర్చకులు శ్రీనివాసచార్యులు కూడా ఆలయ సంప్రదాయాలకు విరుద్ధంగా ప్రవర్తించారని అన్నారు..

యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలలో వారు పాల్గొని సాంప్రదాయానికి విఘాతం కలిగించారని ఆరోపించారు..

ఈ విషయం ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడేందుకు ప్రయత్నించారని అన్నారు ఫిబ్రవరి 25వ తేదీన జరిగిన స్వామివారి కల్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని కాండూరు వెంకటాచార్యులు జాత శౌచం ఉన్నప్పటికీ నిర్వహించారని అన్నారు..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేవుడికి సమర్పించే పట్టు వస్త్రాలను ఆయన మైలలోనే స్వయంగా పట్టుకున్నారని విమర్శించారు…

అదేవిధంగా రాష్ట్ర మంత్రులకు అధికారులకు మైలలో ఆశీర్వచనం చేశారని ఆరోపించారు ఆ తర్వాత జరిగిన రథోత్సవం సందర్భంగా కూడా ఆయన రథంపై ఎక్కి పూజలు నిర్వహించారని పూర్ణాహుతి చక్రస్నానం కార్యక్రమాల్లో కూడా ఆయన పాల్గొన్నారు అని తెలిపారు..

ఇవన్నీ స్వయంగా జరిగాయని టీవీలలో అన్ని పత్రికలలో ఇవి వచ్చాయని చెప్పారు ఈ విధంగా శాస్త్ర విరుద్ధంగా ప్రవర్తించిన కాండూర్ వెంకటాచార్యులు ముఖ్య అర్చకులు కాండూరి శ్రీనివాసచార్యులపై తగిన చర్యలు తీసుకోవాలని తమ డిమాండ్ చేస్తున్నామని అన్నారు..

ఇది హిందూ ధర్మాన్ని శాస్త్రాన్ని అవమానపరచడమేనని ఆయన ఆరోపించారు ఈ మొత్తం వ్యవహారంపై తగిన విధంగా విచారణ జరిపించి కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు..

వీరిని తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు ఐఏఎస్ లేదా రిటైర్డ్ న్యాయమూర్తితో కమిటీ వేసి ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు..

ఈ మేరకు తాము యాదగుట్ట దేవస్థానం ఈవోకు ఒక వినతి పత్రాన్ని అందజేశామని దీనిపై పరిశీలన చేసి తగు చర్యలు తీసుకుంటామని ఈవో హామీ ఇచ్చారని నల్ల రాధాకృష్ణ తెలిపారు..

ఈ కార్యక్రమంలో ఆయన వెంట దళిత సంఘర్షణ సమితి తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు గద్ద యుగంధర్ తెలంగాణ సీనియర్ సిటిజన్స్ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ హనుమాండ్ల విష్ణు, టేకి రాజశేఖర్ విహెచ్పి నేత కొమ్మ గళ్ళ వెంకటేశ్వర్లు, శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాల పరిరక్షణ సమితి కన్వీనర్ కనుకుంట్ల విజయకుమార్ ఉన్నారు…