కౌశిక్ రెడ్డికి యశస్విని రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్..!

*కౌశిక్ రెడ్డికి యశస్విని రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్… నాన్ స్టాప్ పంచులతో అసెంబ్లీలో హాట్ టాపిక్.!

*నిన్నటి నుంచి చూస్తున్నా ఈ లొల్లేంది అంటూ బీఆర్ఎస్ నేతలపై పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో మాట్లాడిన ఆమె, ప్రత్యర్థి నాయకుల ఆరోపణలకు ఒక్కొక్కటిగా కౌంటర్ ఇస్తూ తనదైన శైలిలో స్పందించారు.!!*

*ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కడియం శ్రీహరి తమ అందరికీ తండ్రి లాంటి వారని అన్నారు. ఆయన మార్గదర్శకత్వంలోనే రాజకీయంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు.!!*

*అలాగే గత పదేళ్ల పాలనపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆ కాలంలో జరిగిన కార్యకలాపాలపై సమగ్ర విచారణ జరపాలని, ప్రజల సొమ్మును లూటీ చేసింది ఎవరో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు.!!*

*“వారి పాలన దౌర్జన్య పాలన… కానీ ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజాపాలన కొనసాగుతోంది” అంటూ స్పష్టం చేశారు.!!*

*యశస్విని రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు అసెంబ్లీలో చర్చనీయాంశంగా మారగా, రాజకీయ వర్గాల్లో కూడా హాట్ టాపిక్‌గా నిలిచాయి.!

తెలంగాణ అసెంబ్లీ వేదికగా పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని ఉద్దేశించి ఆమె సంధించిన విమర్శలు, పంచులతో సభలో వాతావరణం వేడెక్కింది. గత రెండు రోజులుగా సభలో జరుగుతున్న పరిణామాలపై ఆమె తనదైన శైలిలో ప్రతిపక్ష నేతలకు గట్టి కౌంటర్ ఇచ్చారు.

అసెంబ్లీలో ప్రసంగించిన యశస్విని రెడ్డి, బీఆర్ఎస్ నేతల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రతి చిన్న విషయానికి అడ్డుతగులుతున్న విపక్ష నేతల తీరు చూసి “నిన్నటి నుంచి చూస్తున్నా.. అసలు ఏంది ఈ లొల్లి?” అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు సభలో ప్రత్యర్థులను ఆత్మరక్షణలో పడేశాయి..