ఏప్రిల్ 13వ తేదీన బీఆర్ఎస్ పార్టీలోకి మాజీ మంత్రి జీవన్ రెడ్డి
ఏప్రిల్ 7వ తేదీన జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించనున్న కేటీఆర్
ఏప్రిల్ 13న పార్టీ చేరిక అనంతరం, జగిత్యాలలోనే పార్టీ ప్లీనరీ పెట్టాలనే ఆలోచనలో బీఆర్ఎస్ పార్టీ..
తెలంగాణ రాజకీయాల్లో అత్యంత సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి (T Jeevan Reddy) బీఆర్ఎస్ చేరికకు మూహుర్తం ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఈ నెల 13వ తేదీన ఆయన గులాబీ కండువా కప్పుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నెల 7వ తేదీన జగిత్యాలకు బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ వెళ్లి జీవన్ రెడ్డితో భేటీ అవుతారని ఈ సందర్భంగా ఆయనను పార్టీలోకి ఆహ్వానించబోతున్నట్లు తెలుస్తోంది. అమెరికా పర్యటన ముగించుకుని రాగానే జీవన్ రెడ్డితో సంప్రదింపులు జరుపుతారని తెలుస్తోంది. కాగా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ గత నెల 25న పార్టీతో తనకు ఉన్న 40 ఏళ్ల అనుబంధానికి ముగింపు పలుకుతూ జీవన్ రెడ్డి కాంగ్రెస్ కు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.