Letest news updates…. ప్రధాన వార్తలు…

Live Update News.

రేపు ఏపీ కేబినెట్‌ సమావేశం..

రేపు ఉ.10.30 గంటలకు సచివాలయంలో కేబినెట్‌ సమావేశం. అమరావతి చట్ట ఆమోదంతో ప్రధాని, కేంద్రానికి ధన్యవాదాలు తెలిపే అవకాశం. 16వ SIPBలో చర్చించిన పెట్టుబడులకు ఆమోదం తెలపనున్న కేబినెట్‌. రూ.39,436 కోట్ల విలువైన 31 ప్రాజెక్టులకు ఆమోదం తెలపనున్న కేబినెట్‌.

మంత్రులు ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా మాట్లాడుతున్నారు..బొత్స.

మంత్రులు ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. మావిగన్‌ గురించి జగన్‌ మాట్లాడినప్పటి నుంచి చంద్రబాబు నిద్రలో కూడా అదే గుర్తుకువస్తోంది. మావిగన్‌ అంటే మీకెందకు ఉలికిపాటు.? అచ్చెన్నాయుడు అహంభావంతో సహనం కోల్పోయి మాట్లాడుతున్నారు అని బొత్స అన్నారు..

అసోం, కేరళ, పుదుచ్చేరిలో ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలు..

అసోం, కేరళ, పుదుచ్చేరిలో ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలు. సాయంత్రం 5 గంటల వరకు అసోంలో 84.42 శాతం పోలింగ్‌ నమోదు. కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు. పుదుచ్చేరిలో 86.92 శాతం పోలింగ్‌ నమోదు.

క్రూరమైన టీఎంసీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి. ఐదేళ్ల క్రితం నందిగ్రామ్‌ ఫలితాలే.. భవానీపూర్‌లో పునరావృతం అవ్వడం ఖాయం. -మోడీ..

క్రూరత్వానికి మారుపేరైన తృణమూల్ కాంగ్రెస్

ప్రభుత్వాన్ని గద్దె దించాలని పశ్చిమ బెంగాల్ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అభివృద్ధి వైఫల్యానికి కొత్త ప్రమాణాలను నిర్దేశిస్తోందని, రాష్ట్రాన్ని వెనక్కి లాగుతోందని ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రగతి కావాలంటే బీజేపీని గెలిపించాలని సూచించారు. బెంగాల్లో తాము అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. భయానక పాలన నుంచి బెంగాల్ను రక్షిస్తామని, సర్వత్రా విశ్వాసం నెలకొనే వాతావరణాన్ని సృష్టిస్తామని ప్రకటించారు.

రేవు నగరం హల్దియా, అసన్సోల్తోపాటు సూరి పట్టణంలో గురువారం ఎన్నికల ప్రచార సభల్లో ప్రధానమంత్రి ప్రసంగించారు. భయానక వాతావరణం నెలకొని ఉంటే పెట్టుబడులను ఆకర్షించలేమని, విశ్వాసం ఉన్నప్పుడే అది సాధ్యమవుతుందని తేల్చిచెప్పారు. మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని నిర్మమ్(క్రూరమైన) సర్కార్గా అభివర్ణించారు. దేశమంతా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుంటే బెంగాల్ మాత్రం వెనుకంజలోనే ఉండిపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు.

వ్యక్తే అనుకుంటే.. పార్టీని కూడా సైకోలా తయారు చేశారు. -సీఎం చంద్రబాబు

ఏపీ రాజధానిగా అమరావతి అని కేంద్రం చట్టం చేసింది. అమరావతికి 49 రాజకీయ పార్టీలు సపోర్ట్‌ చేశాయి. మొన్న మూడు ముక్కల ఆట.. ఇప్పుడు మావిగన్‌ అంటున్నారు. మావిగన్‌ అన్నాడు, వాటికన్‌ అనలేదు సంతోషం. వ్యక్తే అనుకుంటే.. పార్టీని కూడా సైకోలా తయారు చేశారు. -సీఎం చంద్రబాబు..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ క్యాబినెట్ నేడు ఉదయం 10.30 గంటలకు సచివాలయంలో సమావేశం కానుంది. ఈ భేటీకి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షత వహించనున్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడులు, పరిపాలనకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. ఏపీ రాజధానిగా అమరావతి చట్టబద్ధంగా ఆమోదం పొందిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వానికి క్యాబినెట్ కృతజ్ఞతలు తెలపనుంది…

ఢిల్లీ: నేటి నుంచి టోల్‌ గేట్ల దగ్గర నగదు చెల్లింపులు రద్దు.. ఫాస్టాగ్‌ లేదా UPI ద్వారా మాత్రమే చెల్లింపులు

తిరుమల: 21 కంపార్ట్‌మెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 64,136 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 23,255 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.79 కోట్లు

ఢిల్లీ: నేడు కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశం.. ఇందిరా భవన్‌లో మధ్యాహ్నం 3 గంటలకు CWC సమావేశం.. హాజరుకానున్న కాంగ్రెస్‌ పాలిత మూడు రాష్ట్రాల సీఎంలు.. మహిళా రిజర్వేషన్ల చట్ట సవరణ, నియోజకవర్గాల పునర్విభజనపై చర్చ, కేరళ, పుదుచ్చేరి, అసోం అసెంబ్లీ ఎన్నికలతో పాటు బెంగాల్‌, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలపై సమీక్ష..

కాళేశ్వరం 3 బ్యారేజీల మరమ్మతులపై ప్రభుత్వం కీలక నిర్ణయం.

కాళేశ్వరం 3 బ్యారేజీల మరమ్మతులపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మరమ్మతు పనులను వేగంగా పూర్తి చేయాలని సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశించారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనల మేరకు చర్యలు తీసుకోవాలన్నారు. మరమ్మతులకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలన్నారు . ఏజెన్సీలను అప్రమత్తం చేసి పనులు వేగవంతం చేయాలని సూచించారు. సెంట్రల్ వాట‌ర్ అండ్ ప‌వ‌ర్ రీసెర్చ్ స్టేష‌న్ ఆధ్వర్యంలో జ‌రుగుతున్న ప‌రీక్షలు వ‌ర్షాకాలం ప్రారంభానికి ముందే పూర్తి చేయాల‌ని సీఎం చేశారు. అలాగే నీటిపారుదలశాఖతో పాటు ప్రత్యేక టీమ్ ఏర్పాటు చేయాలని, ప్రతి పనిలో CWC సభ్యులు ఉండేలా చూడాలన్నారు సీఎం రేవంత్. మేడిగడ్డలో కుంగిన పిల్లర్‌తో పాటు మొత్తం బ్యారేజ్‌పై సమగ్ర అధ్యయనం అవసరమన్నారు.