మహిళా రిజర్వేషన్ బిల్లుకు BRS పూర్తి మద్దతు..
డీలిమిటేషన్ బిల్లు వల్ల దక్షిణాదికి అన్యాయం జరిగేలా ఉంటే ఒప్పుకునే ప్రసక్తే లేదు..
కేటీఆర్, హరీష్ రావులతో భేటీలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వెల్లడి…
2011లోనే తాము మహిళా రిజర్వేషన్ బిల్లును అసెంబ్లీలో తీర్మానించినట్లు గుర్తుచేసిన కేసీఆర్, ఆ బిల్లుకు రాజ్యసభలో బీఆర్ఎస్ ఎంపీలు మద్దతు తెలపనున్నట్లు వెల్లడి..
డీలిమిటేషన్ బిల్లులో పొందుపరిచిన అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాకే పార్టీ ఒక నిర్ణయానికి వస్తుందన్న కేసీఆర్..
ప్రస్తుతం లోక్సభలో దక్షిణాదికి 24% ఎంపీ సీట్లు ఉన్నాయని, అంతకంటే తగ్గకుండా 50% పెంచాలని, 2011 జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ జరిగితే దక్షిణాదికి తీవ్ర అన్యాయం జరుగుతుందని కేసీఆర్ అభిప్రాయం..
డీలిమిటేషన్ బిల్లు సమగ్రంగా పరిశీలించే వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని ఆదేశాలు..
ఇదే క్రమంలో 20న జగిత్యాల సభ, 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవం గురించి చర్చించిన కేసీఆర్..