లెబనాన్, ఇజ్రాయెల్ మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ..
10 రోజులపాటు కాల్పుల విరమణకు అంగీకారం
ఇరుదేశాల ప్రతినిధులతో వాషింగ్టన్లో శాంతిచర్చలు
నా ఖాతాలో 10వ విజయం కాబోతోంది అంటూ ట్రంప్ పోస్ట్..
శాశ్వత శాంతి ఒప్పందం దిశగా..
జేడీ వాన్స్, మార్కో రూబియోకు కీలక బాధ్యతలు..
శాంతి స్థాపనే లక్ష్యం
ఈ కాల్పుల విరమణ తక్షణమే అమలులోకి వస్తుందని ట్రంప్ పేర్కొన్నారు. ఈ 10 రోజుల వ్యవధిలో ఇరు దేశాల మధ్య శాశ్వత శాంతి ఒప్పందాన్ని కుదిర్చేందుకు దౌత్యపరమైన చర్చలు జరుగుతాయని ఆయన తెలిపారు. ‘ఈ ప్రాంతంలో రక్తపాతాన్ని ఆపడమే మా ప్రాధాన్యత. అమాయక ప్రజల ప్రాణాలు పోకూడదని మేము కోరుకుంటున్నాము’ అని ట్రంప్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
కీలక పరిణామాలు:
ఇజ్రాయెల్ దళాలు – లెబనాన్లోని హిజ్బుల్లా గ్రూపుల మధ్య జరుగుతున్న దాడులు ఈ 10 రోజుల పాటు నిలిచిపోతాయి. ఇరాన్ – అమెరికా మధ్య కూడా ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో, ఈ కాల్పుల విరమణ ప్రకటించడం అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. హొర్ముజ్ జలసంధి వంటి కీలక ప్రాంతాల్లో ఉద్రిక్తతలను తగ్గించడానికి, అంతర్జాతీయ వాణిజ్యానికి ఆటంకం కలగకుండా ఉండటానికి ఈ విరామం ఉపయోగపడుతుందని నిపుణులు భావిస్తున్నారు…