శ్రీరాముడు, లక్ష్మణుడు ఉత్తరాది నుంచి వచ్చిన వలస కూలీలంటూ ప్రకాశ్‌రాజ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు..!

సోషల్‌ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే నటుడు ప్రకాశ్‌రాజ్ (Prakash Raj). ఒక్కోసారి ఆయన పెట్టే పోస్టులు, చేసే ట్వీట్లు వివాదాస్పదమవుతుంటాయి. అలాగే అప్పుడప్పుడు వేదికపై తన మనసులోని భావాలను దాచుకోకుండా కుండబద్దలు కొట్టినట్లు వెల్లడిస్తూ వివాదాలకు కారణమవుతుంటారు. ఇటీవల కేరళలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రకాశ్‌రాజ్‌ రామాయణం గురించి చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీశాయి. శ్రీరాముడు, లక్ష్మణుడు ఉత్తరాది నుంచి వచ్చిన వలస కూలీలంటూ ప్రకాశ్‌రాజ్‌ పేర్కొనడం చూసి నెటిజన్లు మండి పడుతున్నారు..వారు దక్షిణాదికి వచ్చి, ఒక గిరిజనుడైన రావణుడికి చెందిన పొలంలోకి అనుమతి లేకుండా ప్రవేశించి పండ్లను దొంగిలించి తిన్నారని ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు. ఈ దొంగతనాన్ని రావణుడు ప్రశ్నించినందుకే వారి మధ్య వివాదం మొదలైందని, అది కాస్తా పెద్ద యుద్ధానికి దారితీసిందని ప్రకాశ్ రాజ్ విశ్లేషించారు. …
అంతేకాకుండా, శూర్పణఖ ప్రస్తావన తెస్తూ.. ఆమె జీఎస్టీతో కలిపి 2000 డాలర్లు చెల్లించాలని కోరినట్లుగా ఎద్దేవా చేయడం గమనార్హం. పవిత్ర ఇతిహాసాన్ని ప్రస్తుత పన్నుల విధానంతో ముడిపెట్టి ఆయన చేసిన వ్యాఖ్యలు విమర్శలకు దారి తీశాయి. ఇంకా రామాయణాన్ని అవమానించినందుకు ప్రకాష్ రాజ్‌పై క్రిమినల్ కేసు నమోదు చేయడం జరిగింది..