ఇరాన్‌, అమెరికా మధ్య మళ్లీ మాటల యుద్ధం…బుధవారం మళ్లీ ప్రళయమే.. ట్రంప్.

ఇరాన్‌, అమెరికా మధ్య మళ్లీ మాటల యుద్ధం నడుస్తోంది. హార్మూజ్‌ విషయం, ఇరాన్‌తో చర్చలు అంశంలో అధ్యక్షుడు ట్రంప్‌ ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు…తాజాగా కాల్పుల విరమణకు సంబంధించి ట్రంప్‌ మరోసారి వార్నింగ్‌ ఇచ్చారు. మళ్లీ బాంబులు వేయడం ప్రారంభించాల్సి ఉంటుందని తెలిపారు.

కాగా, ఇరాన్ ఒప్పందం కుదరకపోతే కొనసాగుతున్న కాల్పుల విరమణను పొడిగించకపోవచ్చని డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. కాల్పుల విరమణ గడువులోగా ఒప్పందం కుదురుతుందా లేదా అనే దానిపై నిర్ణయం ఆధారపడి ఉంటుందని అన్నారు. మళ్లీ బాంబులు వేయడం ప్రారంభించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ నేపథ్యంలో బుధవారం నుంచి మళ్లీ బాంబుల మోత ఉంటుందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇదిలా ఉండగా.. ఇరాన్‌, అమెరికా-ఇజ్రాయెల్‌ యుద్ధం మొదలైనప్పటి నుంచి మూసి ఉంచిన హార్మూజ్‌ జలసంధిని ఇరాన్‌ పూర్తిగా తెరిచింది. కాల్పుల విరమణ ముగిసేదాకా వాణిజ్య నౌకలు అందులో రాకపోకలు సాగించవచ్చని ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాగ్చీ ప్రకటించారు. ఈ పరిణామాన్ని స్వాగతించిన ట్రంప్‌ ఇరాన్‌ ఒప్పందం కుదిరేదాకా ఇరాన్ దిగ్బంధనాన్ని మాత్రం తాము ఉపసంహరించుకోబోమని స్పష్టం చేశారు. అలా అయితే హార్మూజ్‌ను మళ్లీ మూసి వేస్తామంటూ ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది..