సోషల్ మీడియాలో విచిత్ర చర్చ మొదలైంది. ఏప్రిల్ 23న జరగనున్న తమిళనాడు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సంబంధించిన కొన్ని వీడియోలు, ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి..ఆ బహిరంగ సభలో మోదీ చర్మం మునుపటికంటే కాస్త ముదురు రంగులో (నల్లగా) కనిపించడం వెనుక ఏదైనా రాజకీయ వ్యూహం ఉందా? అనే కోణంలో తీవ్రమైన చర్చ నడుస్తోంది.
స్థానిక ఓటర్ల కోసమే మేకప్ వేశారా?..
ఎక్స్, ఇన్స్టాగ్రామ్ తదితర మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న ఈ వీడియోలు ప్రస్తుతం హాట్ టాపిక్గా మారాయి. తమిళనాడు ఓటర్లను ఆకర్షించేందుకు, స్థానికులతో మమేకమయ్యేందుకు ఉద్దేశపూర్వకంగానే మోదీకి ముదురు రంగు మేకప్ లేదా బ్రాంజర్ వేశారంటూ కొందరు నెటిజన్లు ఆరోపిస్తున్నారు. అయితే ఈ వాదనలు కేవలం ఊహాగానాలు మాత్రమేనని, వీటికి ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టమవుతోంది. అయినా ఈ అంశంపై వ్యంగ్యాస్త్రాలు, మీమ్స్తో సోషల్ మీడియా హోరెత్తిపోతోంది.