నిన్న ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న శంకర్ గౌడ్…

వరంగల్
*🔹ఆర్టీసీ డ్రైవర్ కోలా శంకర్ గౌడ్ మృతి…*

నిన్న ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న శంకర్ గౌడ్…

80 శాతం కాలిన గాయాలతో శంకర్ గౌడ్ మృతి…

మృతునికి భార్య,కూతురు,ఒక కుమారుడు… స్వస్థలం ఖానాపూర్..

శంకర్ గౌడ్ మృతి తో ఆర్టీసీ కార్మిక సంఘాల ఆగ్రహం…

*• నేడు బంద్ కు పిలుపు…

నర్సంపేటలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన శంకర్ గౌడ్ మృతి..

80% కాలిన గాయాలతో గ్రీన్ ఛానెల్ ద్వారా వరంగల్ ఎంజీఎం నుండి హైదరాబాద్ తరలిస్తుండగా, నగరానికి చేరుకున్నాక మృతి చెందిన శంకర్ గౌడ్…

తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెలో ఓ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. వరంగల్ జిల్లా నర్సంపేటలో ఆర్టీసీ డ్రైవర్ కోలా శంకర్ గౌడ్ గురువారం ఉదయం పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకోగా..చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించాలని వైద్యులు సూచించారు. ఈ క్రమంలో శంకర్‌ను వరంగల్ నుంచి హైదరాబాద్‌కు తరలిస్తుండగా.. దారి మధ్యలోనే మరణించినట్లు తెలుస్తోంది. దాదాపు 80 శాతం కాలిన గాయాలు ఉండటంతో శంకర్ గౌడ్ మరణించినట్లు సమాచారం. ప్రస్తుతం అతని మృతదేహం కంచన్ బాగ్ DRDOలో ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

తమ డిమాండ్లను నెరవేర్చాలని ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె.. శంకర్ గౌడ్ మృతితో మరింత తీవ్రమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రేపు కార్మిక సంఘాలతో ఐదుగురు మంత్రుల కమిటీ చర్చిస్తుందని ప్రభుత్వం ప్రకటించినా.. అందుకు కార్మికులు సిద్ధంగా ఉంటారా ? మరేదైనా కార్యాచరణ ప్రకటిస్తారా? అన్నది సందిగ్ధంగా మారింది.