టీఆర్ఎస్ పేరు తనకు రాసిపెట్టి ఉందేమో…తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత

టీఆర్ఎస్ పేరు తనకు రాసిపెట్టి ఉందేమోననని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. కవిత ఏప్రిల్ 26వ తేదీన కొత్త పార్టీ పేరును ప్రకటించిన సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ పేరుతో పార్టీని ఏర్పాటు చేయనున్నట్టుగా ప్రకటించారు. టీఆర్ఎస్ అంటే… తెలంగాణ రాష్ట్ర సేన అని తెలిపారు. దీంతో తెలంగాణ రాజకీయాల్లో టీఆర్ఎస్ పేరుపై ఆసక్తికరమైన చర్చతో పాటు వివాదం మొదలైనట్టుగా కనిపించింది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్థాపించిన కొత్త పార్టీకి ‘టీఆర్ఎస్’ అనే పేరును కేటాయించవద్దని కోరుతూ తెలంగాణ రాజ్య సమితి అధ్యక్షుడు తుపాకుల బాలరంగం కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాయడం చర్చనీయాంశమైంది. దీంతో కవిత పార్టీకి టీఆర్ఎస్ అనే పేరు దక్కుతుందా? లేదా? అనే చర్చ మొదలైంది..
తాజాగా కవిత ఎక్స్‌లో ఒక పోస్టు చేశారు. ‘‘తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్)’’ కు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపిందని సమస్త తెలంగాణ సమాజానికి తెలియ చేయడానికి సంతోషిస్తున్నామని కవిత పేర్కొన్నారు. రెండు దశాబ్దాలుగా తెలంగాణ సాంస్కృతిక పరిరక్షణ, పునరుజ్జీవం కోసం తాను చేసిన కృషిని కొనసాగిస్తూ… ఇక ముందు కూడా తెలంగాణ అస్తిత్వ పరిరక్షణే ధ్యేయంగా అంకితభావంతో పని చేస్తానని కవిత చెప్పుకొచ్చారు..