జై శ్రీరామ్ అంటే పైనుండి పైసలు పడతాయా ?..మంత్రి కొండా సురేఖ బీజేపీ పై సంచలన వ్యాఖ్యలు….

జై శ్రీరామ్ అంటే పైనుండి పైసలు పడతాయా?

బీజేపీ వాళ్లు మీటింగ్ పెట్టి జై శ్రీరామ్ అనడం తప్ప చేసేది ఏం ఉండదు..

రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే ఇక్కడి బీజేపీ నాయకులు మూసుకొని కూర్చుంటున్నారు.– మంత్రి కొండా సురేఖ..

తెలంగాణ రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. ఈ నెల 10న ప్రధాని మోదీ తెలంగాణకు రానున్నారు. తెలంగాణ బీజేపీ నేతలు సికింద్రాబాద్ పరెడ్ గ్రౌండ్స్ లో సభు నిర్వహిస్తున్నారు. ఈ సభకు తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు,కార్యకర్తలు భారీగా రానున్నారు. మోదీ మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి తెలంగాణకు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు దాదాపు 7 వేల కోట్లతో వివిధ డెవలప్ మెంట్ పనులను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో తెలంగాణలో బీజేపీ నేతలు ఈ సభను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అయితే.. ప్రధాని మోదీ రాక వేళ తెలంగాణ కాంగ్రెస్ నేతలు విమర్శల్ని ఎక్కుపెట్టాయి. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలంగాణ బీజేపీ నేతలు, ప్రధాని మోదీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు..మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. ప్రధాని మోదీ పర్యటనపై సెటైర్లు వేశారు. తెలంగాణ బీజేపీ నేతల్ని ఏకీపారేశారు. ప్రధాని మోదీని రప్పిస్తారని, ఆయన హిందిలో మాట్లాడాతారన్నారు. జైశ్రీమ్ అని నినాదాలు చేసి వెళ్లిపోతారన్నారు. అసలు.. జై శ్రీరామ్ అంటే పైనుండి పైసలు పడతాయా..?.. అంటూ వివాదాస్పదంగా మాట్లాడారు. బీజేపీ వాళ్లు మీటింగ్ పెట్టి జై శ్రీరామ్ అనడం తప్ప చేసేది ఏం ఉండదని పంచ్ లు వేశారు.

తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే ఇక్కడి బీజేపీ నాయకులునోర్లు మూసుకొని కూర్చుంటున్నారనిఎద్దేవా చేశారు. మనకు రావాల్సిన పథకాలు, ఫండ్స్ ను మంజురు చేయించుకొవడంతో బీజేపీ నేతలు చొరవ చూపించడంలేదని అన్నారు. ఇక కొండా సురేఖ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి…దీన్ని బీజేపీ నేతలు ఖండిస్తున్నారు. జైశ్రీరామ్ అంటూ పైసలు పడ్తాయా..?. అనడం ఎంత వరకు సమంజసం అని హిందు సంఘాలు కూడా కొండా సురేఖ వ్యాఖ్యలపై భగ్గుమంటున్నాయి..

మీ ప్రాంతాల్లో వార్త ఏదైనా మాకు అందించండి…
మా వాట్సాప్ నెంబర్…+91 9133057959.