కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ముదిరిన పోరు*

వరంగల్లో మే 6న బీఆర్ఎస్ నిర్వహించనున్న ‘రైతు సంగ్రామ సదస్సు’ రాజకీయ రచ్చకు దారితీసింది. మున్సిపల్ అధికారులు పార్టీ జెండాలు, తోరణాలను తొలగించడంపై బీఆర్ఎస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ‘కిసాన్ మేళా’ను ప్రకటించడంతో ఇరు పార్టీల మధ్య పోటాపోటీ వాతావరణం నెలకొంది. దీంతో వరంగల్ చుట్టూ ఇప్పుడు రాజకీయ వేడి పెరిగింది.