తమిళనాడులో టివికే విజయ్ కు మద్దతుగా నిలవాలని కాంగ్రెస్ నిర్ణయం.

తమిళనాడులో టివికే విజయ్ కు మద్దతుగా నిలవాలని కాంగ్రెస్ నిర్ణయం.

ఏఐసిసి అధ్యక్షులు మల్లిఖార్జున్ ఖర్గే నివాసంలో జరిగిన కాంగ్రెస్ ముఖ్యుల సమావేశం

హాజరైన రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, జయరాం రమేష్

ఐదు రాష్ర్టాల ఎన్నికలు, ఫలితాలు, అనంతర పరిస్థితులపై సమావేశంలో చర్చ

తమిళనాడు లో ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించాలని టివికె అధినేత విజయ్ కోరారు

లౌకిక ప్రభుత్వ ఏర్పాటు, రాజ్యాంగ పరిరక్షణ కోసం తమిళనాడు ప్రజలు తీర్పు నిచ్చారు

విజయ్ పార్టీ విజ్నప్తిపై తగిన విధంగా నిర్ణయం తీసుకోవాలని తమిళనాడు కాంగ్రెస్ నేతలకు స్పష్టం చేశాం

సమావేశానంతరం కేసీ వేణుగోపాల్..

తమిళనాడు రాజకీయ చరిత్రలో ఒక అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. దశాబ్దాలుగా సాగుతున్న ద్రవిడ పార్టీల ఆధిపత్యానికి తెరదించుతూ, ప్రముఖ నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (TVK) అఖండ విజయాన్ని నమోదు చేసింది. శాసనసభ ఎన్నికల్లో ఏకంగా 108 స్థానాలను కైవసం చేసుకుని అతిపెద్ద పార్టీగా అవతరించి, రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరిచింది. కేవలం సినిమా గ్లామర్‌తోనే కాకుండా, పక్కా ప్రణాళికతో విజయ్ తన ప్రజాబలాన్ని నిరూపించుకున్నారు…

విజయ్ తమ మద్దతు కోరిన విషయాన్ని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మంగళవారం ధృవీకరించారు. అయితే, టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలా లేదా అనే నిర్ణయాన్ని కాంగ్రెస్ హైకమాండ్ ఆ రాష్ట్ర పార్టీ శాఖకే అప్పగించినట్లు ఆయన స్పష్టం చేశారు. స్థానిక రాజకీయ సమీకరణాలు, భవిష్యత్తు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తమిళనాడు కాంగ్రెస్ నేతలు మాట్లాడి నిర్ణయం తీసుకున్నారు..లౌకిక ప్రభుత్వ ఏర్పాటు, రాజ్యాంగ పరిరక్షణ కోసం తమిళనాడు ప్రజలు తీర్పు నిచ్చారు

విజయ్ పార్టీ విజ్నప్తిపై తగిన విధంగా నిర్ణయం తీసుకోవాలని తమిళనాడు కాంగ్రెస్ నేతలకు స్పష్టం చేశాం అన్నారు..