ప్రభుత్వ ఏర్పాటు వార్తలపై క్లారిటీ ఇచ్చిన డీఎంకే

ప్రభుత్వ ఏర్పాటు వార్తలపై క్లారిటీ ఇచ్చిన డీఎంకే

ఎన్నికల్లో గెలిచిన టీవీకే పార్టీని ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా అడ్డుకొని ప్రజాస్వామ్య వ్యతిరేక పనులు చేయమని తేల్చి చెప్పిన డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్..

తమిళనాడు రాష్ట్ర రాజకీయాలు చాలా హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. ఏ క్షణం ఏం జరుగుతుందో అన్న టెన్షన్ అందరిలోనూ ఉంది. హంగ్ ఏర్పడిన నేపథ్యంలో ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారనే దానిపైన ఆసక్తి నెలకొంది. ఇలాంటి క్రమంలో తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటు కోసం డీఎంకేతో చర్చలు జరుగుతున్నట్లు వస్తున్న వార్తలపై అన్నాడీఎంకే క్లారిటీ ఇచ్చింది. ఆ వార్తలను ఖండించింది. డీఎంకే తమ బద్ధ శత్రువు అని కుండ బద్దలు కొట్టి చెప్పింది అన్నాడీఎంకే. ఈ సందర్భంగా విజయ్, అతని పార్టీ టీవీకేల పేరు ప్రస్తావించకుండా విమర్శలు కూడా చేసింది….

ఇదంతా ఆ నటుడి పార్టీ కుట్ర అని మండిపడింది. తప్పుడు ప్రచారం చేసి లబ్ధి పొందాలని చూస్తున్నట్లు పరోక్షంగా విజయ్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇన్నాళ్లు మంచి నటుడుగానే తెలుసని.. కానీ అతనిలో మంచి రచయిత కూడా ఉన్నట్లు ఇప్పుడే అర్థమవుతుందని సెటైర్లు పేల్చింది అన్నాడీఎంకే. ఇక అటు 108 సీట్లు సాధించిన విజయ్ కి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే సపోర్ట్ చేసింది. అయినప్పటికీ ప్రభుత్వం ఏర్పాటుకు ఆరు సీట్లు అవసరం. మరి ఇలాంటి నేపథ్యంలో ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారో చూడాలి..