ఒక కేంద్రమంత్రి కుమారుడు పరారీలో ఉండడం దేశ చరిత్రలోనే మొదటిసారి..కేటీఆర్

పోక్సో కేసులో ఇరుక్కున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) కుమారుడు బండి సాయి భగీరథ్‌ పరారీలో ఉండడంపై బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్(KTR) తీవ్రంగా స్పందించారు..ఒక కేంద్రమంత్రి కుమారుడు పరారీలో ఉండడం దేశ చరిత్రలోనే మొదటిసారి అని కేటీఆర్ ఎక్స్‌లో వ్యంగ్యంగా పోస్ట్‌ పెట్టారు. ఆ పోస్ట్‌కు ఆయన బేటీ బచాబో, పోక్సో యాష్ ట్యాగ్‌లు జత చేశారు.

మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన బండి సాయి భగీరథ్‌ పోలీసులకు దొరక్కుండా తప్పించుకు తిరుగుతడంపై కేటీఆర్ సైటైర్లు వేశారు. ‘భారత దేశ చరిత్రలో కేంద్ర హోం మంత్రి కుమారుడు పరారవ్వడం ఇదే మొదటిసారి’ అని ఆయన ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు..పేట్ బషీర్‌బాగ్‌ పోలీస్ స్టేషన్‌లో బాధితురాలి ఫిర్యాదుతో భగీరథ్‌ను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కానీ, మూడు రోజులుగా అతడి ఫోన్ స్విచ్ఛాఫ్‌ చేసి ఉంది. దాంతో, కూకట్‌పల్లి డీసీపీ రితిరాజ్ గైక్వాడ్ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణను వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో భగీరథ్ పరారీలో ఉండడంపై కేటీఆర్ ఎక్స్ పోస్ట్‌ ద్వారా నేరస్థులకు కొమ్ముకాస్తున్న బీజేపీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.