కేంద్ర మంత్రి బండి సంజయ్ కమారుడు బండి బగీథ్‌కు పోలీసులు మరో షాక్..!

కేంద్ర మంత్రి బండి సంజయ్ కమారుడు బండి బగీథ్‌కు పోలీసులు మరో షాక్ ఇచ్చారు. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఫోక్సో కేసులో నింధితుడిగా ఉన్న అతనికి పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. బండి భగీరథ్ హైదరాబాద్ నుండి పారిపోకుండా పోలీసులు నోటీసులు జారీ చేసారు. ఇప్పటికే బండి భగీరథ్ కోసం పేట్ బషీరాబాద్ పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. దీంతో పాటుగా కుమారున్ని పట్టుకోవడం కోసం కేంద్రమంత్రి బండి సంజయ్‌ ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఎట్టి పరిస్ధితుల్లోను హైదరాబాద్ దాటి బైటికి వెల్ల వద్దని పోలీసులు తెలిపారు…

నిన్న కోర్టులో సుధీర్ఘ వాదనల అనంతరం తదుపరి విచారణలో మధ్యంతర బెయిల్​ పిటిషన్ పై తుది ఉత్తర్వులు ఇస్తామని హైకోర్టు పేర్కొంది. అప్పటి వరకు పోలీసులు అరెస్ట్ చేయకుండా మధ్యంతర రక్షణ కల్పించాలంటూ బండి భగీరథ్​ తరపు న్యాయవాది చేసిన అభ్యర్థనను కూడా తోసిపుచ్చింది. మైనర్​ అయిన తన కూతురిని మాయ మాటలతో లొంగదీసుకుని బండి భగీరథ్​ లైంగిక దాడులకు పాల్పడ్డాడంటూ ఓ మహిళ ఈనెల 8న పేట్​ బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు పోలీసులు బీఎన్​ఎస్​, పోక్సో యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేశారు.