బాధితుల ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలి: ఎస్పీ నరసింహ

బాధితుల ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలి: ఎస్పీ నరసింహ

జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డేలో బాధితుల నుంచి ఎస్పీ నరసింహ 6 వినతులు స్వీకరించారు. వివిధ సమస్యలపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించిన ఆయన, తక్షణ చర్యలకై సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశాలు జారీ చేశారు. బాధితులకు చట్టబద్ధంగా, ఆలస్యం లేకుండా న్యాయం చేయాలని, పోలీస్ శాఖ ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటుందని ఎస్పీ అన్నారు