కొహెడ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణ పనులపై నేడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ సమీక్ష చేయనున్నారు. ఈ సమీక్షలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తో పాటు మార్కెటింగ్, వ్యవసాయశాఖ అధికారులు పాల్గొననున్నారు. కోహెడ్ మార్కెట్ నిర్మాణ పనుల పురోగతిపై రేవంత్ రెడ్డి సమీక్ష చేయనున్నారు.
పనుల పురోగతిపై…
ఈ ఏడాది డిసెంబర్ 9వ తేదీ నుంచి కొహెడ మార్కెట్ సేవలను ప్రారంభించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోవడంతో దానికి సంబంధించిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించనున్నారు. మొత్తం మూడు దశల్లో కొహెడ సమగ్ర మార్కెట్ నిర్మాణం పూర్తి చేసేలా ప్లాన్ చేయాలని దిశానిర్దేశం చేయనున్నారు. బాటసింగారం మార్కెట్లో జరిగే కార్యకలాపాలు సైతం కొహెడలో నిర్వహించాలని నిర్ణయించారు.