తెలంగాణలో వడదెబ్బతో నిన్న ఒక్కరోజే 22 మంది మృతి
అనేక జిల్లాలో 45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రత
అత్యధికంగా పెద్దపల్లి, సూర్యాపేట జిల్లాల్లో 46.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
నేడు పలు జిల్లాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక..
తెలంగాణ (Telangana)లో మునుపెన్నడూ లేని విధంగా పగటి ఉష్ణోగ్రతలు ఏకంగా 45 డిగ్రీల మార్కును దాటి నమోదువుతున్నాయి. గురువారం అత్యధికంగా పెద్దపల్లి, సూర్యాపేట జిల్లాల్లో 46.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో వడదెబ్బ మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. నిన్న ఒక్కరోజే రాష్ట్రంలో ఎండ తీవ్రత తట్టుకోలేక వేర్వేరు ప్రాంతాల్లో 22 మంది మృతిచెందారు. ఉదయం 9 గంటల నుంచే సూర్యుడు ప్రతాపం చూపిస్తుండటంతో జనం ఇళ్ల నుంచి బయటకు రావడానికి జంకుతున్నారు. మధ్యాహ్నం వేళల్లో రహదారులన్నీ జనసంచారం లేక వెలవెలబోతున్నాయి,…