స్విమ్మింగ్ పూల్‌లో యువకుడిని ముంచి చంపిన స్నేహితుడు..

మన పిల్లలు ఎవరితో తిరుగుతున్నారు? ఎలాంటి స్నేహాలు చేస్తున్నారు?

ఉత్తరప్రదేశ్‌లోని సంభల్ జిల్లాలో జరిగిన ఈ దారుణం మన కళ్ళు తెరిపించాలి. కేవలం పాత కక్షల మనసులో పెట్టుకుని, ఒక 18 ఏళ్ల యువకుడిని అతని స్నేహితుడే స్విమ్మింగ్‌పూల్‌లో నొక్కిపట్టి ప్రాణాలు తీశాడు. ఊపిరాడక కొట్టుమిట్టాడుతున్నా దయలేకుండా చేసిన ఈ ఘోరం అక్కడి సీసీటీవీలో బయటపడింది.

స్విమ్మింగ్ పూల్‌లో యువకుడిని ముంచి చంపిన స్నేహితుడు..

ఉత్తరప్రదేశ్‌లోని సంభల్‌లో ఒక దారుణమైన ఘటన వెలుగు చూసింది.

స్నేహితులతో కలిసి సరదాగా స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొడుతున్న సోహిల్ (18) అనే యువకుడిని ఒక మిత్రుడే కిరాతకంగా హతమార్చాడు.

పాత కక్షల నేపథ్యంలో, బాధితుడిని రెండు చేతులతో పట్టుకుని నీటిలో ముంచేశాడు.
ఊపిరాడక బాధితుడు ఎంతగా కొట్టుకున్నా వదలకుండా రెండు నిమిషాల పాటు నీటిలోనే ఉంచి చంపేశాడు.

దీనికి సంబంధించిన సిసిటివి (CCTV) దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
https://x.com/i/status/2059323490755654018