రైతులకు 24 గంటల కరెంటు అవసరం లేదు మూడు గంటలు చాలు – కాంగ్రెస్ నేత, రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి..

రైతులకు 24 గంటల కరెంటు అవసరం లేదు మూడు గంటలు చాలు

– కాంగ్రెస్ నేత, రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి..

తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి 24 గంట‌ల క‌రెంట్ అవ‌స‌ర‌మే లేదు.. 3 గంట‌ల క‌రెంట్ చాలు అని కాంగ్రెస్ నేత, రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి పేర్కొన్నారు. రైతు డిస్కం నిర్ణ‌యాన్ని స్వాగ‌తిస్తున్నామ‌ని, దీని వ‌ల్ల రైతుల‌కు మేలు జ‌రుగుతుంద‌ని ఆయ‌న అన్నారు. రైతు డిస్కంపై టీజీఈఆర్సీ నిర్వ‌హించిన బ‌హిరంగ విచార‌ణ స‌మావేశానికి కోదండ రెడ్డి హాజ‌రై కాంగ్రెస్ పార్టీ అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు.

కోదండ రెడ్డి అభిప్రాయం.. ఆయ‌న మాట‌ల్లోనే..
తెలంగాణ రైతాంగం ఇబ్బందులు ప‌డుతున్నారు.. తెలంగాణ ప్రాంతంలో ఒకప్పుడు మోట‌బావులు, గొలుసుక‌ట్టు చెరువులు వీటి ద్వారా నీరు తోడుకుని వ్య‌వ‌సాయం చేసేవారు. ఆ ర‌కంగా దేశానికి ఆహారం అందించి నెహ్రూ లాంటి పెద్ద‌ల చేత రైతు దేశానికి వెన్నెముక, రైతు అన్న‌దాత అని ప్ర‌శంసించిన సంద‌ర్భాల‌ను గుర్తు చేస్తున్నాను. ఈ రోజు తెలంగాణ రైతు విద్యుత్ పంపిణీ సంస్థ ఏర్పాటు చేయ‌మ‌ని మా ప్ర‌భుత్వం క‌మిష‌న్‌కు ద‌ర‌ఖాస్తు పెట్టుకున్న సంద‌ర్భంగా ఈ వ్య‌వ‌స్థ ఏర్పాటు చేయ‌డ‌మ‌నేది ఒక రైతుగా, తెలంగాణ వ్య‌వ‌సాయ రైతు క‌మిష‌న్ చైర్మ‌న్‌గా నేను స‌మ‌ర్థిస్తున్నాను. దీంట్లో ఏదైనా ఒక వ్య‌వ‌స్థ కొత్త‌గా ఏర్పాటు చేసిన‌ప్ప‌డు అన్ని సంపూర్ణంగా ఏర్పాటు చేయ‌లేం. అందులో అనేక అవ‌క‌త‌వ‌క‌లు ఉంటాయి. అనుభ‌వ‌రీత్యా స‌రిచేసుకుంటూ పోతాం. విద్యుత్ పంపిణీ సంస్థ‌లో ఏవైనా లోపాలుంటే స‌రిదిద్దుకునేందుకు అవ‌కాశం ఉంది. ఆ సూచ‌న‌లు చేయ‌మ‌ని మ‌న‌వి చేస్తున్నా అని కోదండ రెడ్డి పేర్కొన్నారు.